For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ టాపిక్ : రవితేజ ‘బలుపు’ తగ్గింది

  By Srikanya
  |

  హైదరాబాద్ : మాస్ మహారాజా నుంచి ప్లాప్ చక్రవర్తిగా ప్రమోషన్ సంపాదించిన హీరో రవితేజ. ఏ సినిమా పట్టుుకంటే అది బంగారం..దాని బిజినెస్ అయిపోతుంది అనుకునే స్ధితిలో ఉన్న రవితేజకు వరస ప్లాపులు దెబ్బకొట్టాయి. ఎన్నో ఆశలు పెట్టుుకున్న సారొచ్చారు చిత్రం సైతం భాక్సాఫీస్ వద్ద చీదటంతో దాని ఎఫెక్టు...రవితేజ మార్కెట్ పై పడిందని ట్రేడ్ లో వినడుతోంది. ఖచ్చితంగా రవితేజ తదుపరి చిత్రం 'బలుపు' బిజినెస్ కి ఈ ఫ్లాప్ ప్రభావం పడుతుందని అంచనాలు వేస్తున్నారు.

  2011 లో వచ్చిన మిరపకాయ తర్వాత వరసగా...దొంగల ముఠా, నిప్పు, వీర, దరువు, దేముడు చేసిన మనుష్యులు, సారొచ్చారు డిజాస్టర్స్ అయ్యాయి. కథ,కథనం పట్టింటుకోకుండా వరసగా సినిమాలు ఒప్పకోవటం మొదట్లో రవితేజకు కలిసి వచ్చినా రాను రాను ఆ స్టాటజీ కి సొమ్ములు రాలటం లేదు. నాలుగు సినిమాలు చేస్తే వాటిల్లో ఒకటి హిట్టైనా..హిట్ హీరో అనిపించుకోవచ్చనేది ఈ తరహా హీరోల స్టాటజీ. నడిచినంతకాలం అవి బాగానే విజయాలు తెచ్చిపెట్టి...నిలబెట్టాయి. కానీ ప్లాప్ లు రావటం మొదలు పెట్టాక రిలీఫ్ లేకుండా చావు దెబ్బ కొట్టడం మొదలెట్టాయి. రవితేజ ఈ పరిస్ధితి నుంచి బయిటపడాలంటే బలుపు చిత్రం పెద్ద హిట్ కావాలనేది పచ్చి నిజం.

  పివిపి సినిమా బేనర్ పై గతంలో రవితేజతో వీడింతే చిత్రం రూపొందించిన ప్రసాద్ వి.పొట్లూరి 'బలుపు' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు రవితేజతో గోపీచంద్ మలినేని 'డాన్‌శీను' చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈచిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ స్క్రిప్టు రచయితగా పని చేస్తున్నారు. 'దూకుడు' సినిమాతో పాటు పలు చిత్రాలకు అదిరిపోయే స్క్రిప్టు అందించిన కోన వెంకట్ ఈ చిత్రానికి ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్ తో కూడిన స్క్రిప్టు అందించబోతున్నాడు. ఈ సారి రవితేజకు హిట్టు ఖాయమనే ధీమా ఆ చిత్ర వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

  ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా సెలక్ట్ అయింది. సంగీత దర్శకడు తమన్ ఈ చిత్రానికి సూపర్ హిట్ ఆడియో అందించేందుకు కృషి చేస్తున్నాడు. ఈ చిత్రంలో రవితేజ క్యారెక్టర్ కామెడీని పండిస్తూ యాక్షన్ సీన్లతో అదరగొట్టేదిగా ఉంటే... శృతి హాసన్ క్యారెక్టర్ రవితేజకు తగిన జోడీగా ఎంటర్ టైన్మెంట్ పంచుతూ అందాల ఆరబోతతో గ్లామరస్‌గా ఉంటుందని తెలుస్తోంది.

  English summary
  
 The only one film which is on sets for Ravi Teja is ‘Balupu’ and producers are now worried on how ‘Saarochcharu’ would affect the business of their action project. To be more clear, all the way from ‘Mirapakay’ in 2011 to till date…there are non-stop disasters are ‘Dongala Muta, Veera, Nippu, Daruvu, Devudu Chesina Manushulu and Saarochccharu’ damaged the reputation of raviteja as a minimum guaranteed hero. Call it his over-speed in accepting the projects or showing no concern about script and director…the results have been dismal. So, makers of ‘Balupu’ have a certain reason to fear on what is the actual market value of Ravi now.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X