»   » ఆశ్చర్యపోయే వార్త: మోహన్ లాల్ , పవన్ కాంబినేషన్ ..దాదాపు ఫిక్స్ అయినట్లే

ఆశ్చర్యపోయే వార్త: మోహన్ లాల్ , పవన్ కాంబినేషన్ ..దాదాపు ఫిక్స్ అయినట్లే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వినటానికి ఆశ్చర్యకరంగా ఉన్న వార్తే అయినా ఇది నిజం అంటోంది మళయాళి పరిశ్రమ. మోహన్ లాల్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కు చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చినట్లే అని తెలుస్తోంది. రీసెంట్ గా మనమంతా, జనతాగ్యారేజ్ చిత్రాలతో దుమ్ము రేపిన మోహన్ లాల్...ఇప్పుడు మరో తెలుగు చిత్రంతో మనని పలకరించబోతున్నారు.

మళయాళి ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్ లో రూపొందే చిత్రంలో మోహన్ లాల్ ని ఓ కీలకమైన పాత్రకు అడిగినట్లు చెప్తున్నారు. మోహన్ లాల్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

మోహన్ లాల్ తన మార్కెట్ ని విస్తరించుకునే ప్రయత్నంలో తెలుగుపై కాన్సర్టేట్ చేస్తున్నారు. తెలుగు హీరోలతో చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుతం అల్లు శిరీష్ తో సినిమా చేస్తున్న ఆయన పవన్ తో సినిమా అనగానే మరో ఆలోచన లేకుండా ఓకే చేసినట్లు చెప్తున్నారు.

WOW! Mohanlal To Share The Screen Space With Pawan Kalyan?

మొదట ఈ పాత్రకు ఉపేంద్రను అనుకున్నా మార్కెట్ విస్తృతి దృష్ట్యా మోహన్ లాల్ ని సీన్ లోకి తెచ్చినట్లు సమాచారం. మోహన్ లాల్ ఉంటే బిజినెస్ పెరుగుతుందని నిర్మాత భావించటంతో ఈ విషయం మెటీరియలైజ్ అయ్యింది.

నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) మాట్లాడుతూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో నిర్మిస్తున్న ఈ చిత్రం 'తమ సంస్థకు ఎంతో ప్రతిష్టాత్మకమైనదని తెలిపారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. వీరితో పాటు ఇతర ప్రముఖ తారాగణం ఎంపిక కాగానే త్వరలో ప్రకటించటం జరుగుతుంది.

ఈ చిత్రం ద్వారా సౌత్ ఇండియాలో పాపులర్ సంగీత దర్శకుడు 'అనిరుద్ రవిచందర్' సంగీత దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఇండియాలో టాప్ మోస్ట్ కెమెరామెన్ వి. మణికందన్ (మణిరత్నం 'రావణ్', శంకర్ 'అపరిచితుడు', బాలీవుడ్ చిత్రాలు 'ఏ జవానీ హై దీవాని', మైహూనా) ఈ చిత్రానికి కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. కళా దర్శకత్వం: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: చంటి (కోటగిరి వెంకటేశ్వరరావు), ఎగ్జి క్యూటివ్ నిర్మాత: పి.డి.వి. ప్రసాద్. సమర్పణ: శ్రీమతి 'మమత', నిర్మాత: ఎస్.రాధాకృష్ణ (చినబాబు), రచన-దర్శకత్వం: త్రివిక్రమ్.

English summary
Mohanlal is being considered for an important role in Pawan Kalyan's next film, which would be directed by popular Telugu film-maker Trivikram Srinivas.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu