»   »  పవన్ ఎఫెక్ట్ : 'ఎవడు' రిలీజ్ తేదీ మార్పు?

పవన్ ఎఫెక్ట్ : 'ఎవడు' రిలీజ్ తేదీ మార్పు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఎవడు'. శ్రుతిహాసన్‌, అమీ జాక్సన్‌ హీరోయిన్స్. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జూలై 25 న విడుదల చేయాలని మొదట అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ లో డిలే వల్ల జూలై 31 కి మార్చారు. అయితే ఇప్పుడు దాన్ని ప్రీ ఫోన్ చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. అంటే జూలై 25నే విడుదల చేస్తారని చెప్తున్నారు. అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. అప్పటికానీ విడుదల తేదీపై క్లారిటీ రాదు.

ఎందుకంటే పవన్ కళ్యాణ్ తాజా చిత్రం అత్తారింటికి దారేది ఆగస్టు మొదటి వారంలో వచ్చేస్తోంది. ఒక వారం కుడా గ్యాప్ లేకుండా వేయటానికి డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకోరు. అలాగే థియోటర్స్ ప్లాబ్లం కూడా వస్తుంది. దానికి తోడు ఇద్దరూ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్లే కావటంతో ఫ్యాన్స్ పరంగా కూడా సమస్యలు ఉంటాయి. ఇద్దరకీ చాలా బాగం కామన్ అభిమానులు ఉంటారు. ఈ నేపధ్యంలో ఈ క్లాష్ ని తప్పించటానికి రామ్ చరణ్ ముందుగానే విడుదల చేసేందకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు.

దిల్‌ రాజు మాట్లాడుతూ ''వైవిధ్యమైన కథ, కథనాలతో సాగే చిత్రమిది. చరణ్‌ నటన, నృత్యాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌, కాజల్‌ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు''అన్నారు.

చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా మగధీరను మించిన హిట్టవుతుందని స్పష్టం చేసారు. మగధీర తర్వాత ఆ రేంజి హిట్టయ్యే సినిమా 'ఎవడు' మాత్రమే. మగధీరకు ఏమాత్రం తీసి పోని సినిమా ఇది, మగధీర తర్వాత ఇంత తక్కువ సమయంలో ఎవడు లాంటి సినిమా చేసే అవకాశం రావడం చరణ్ అదృష్టమే. అభిమానులు ఏ రేంజిలో ఊహించుకున్నా ఆ రేంజిని అందుకునే సత్తా ఉన్న సినిమా ఎవడు అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

కోట శ్రీనివాసరావు, జయసుధ, సాయికుమార్‌, రాహుల్‌దేవ్‌, అజయ్‌, ఎల్‌.బి.శ్రీరాం, సుప్రీత్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు ఇతర పాత్రధారులు. సహ నిర్మాతలు: శిరీష్‌-లక్ష్మణ్‌, కూర్పు: మార్తాండ్‌.కె.వెంకటేష్‌, కళ: ఆనంద్‌ సాయి, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌

English summary
‘Atharintiki Daaredi’ has confirmed its release date is Aug 7th then Dil Raju the producer of ‘Yevadu’ is in a thought of releasing the movie near to the first date.Now the official announcement has to be made by the movie makers that the movie release date is on July 27th or July31st.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu