twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ ఊహించలేదట...ఈ యంగ్ హీరోలు ఝలక్ ఇస్తారని, ఎవరు వాళ్లు?

    By Srikanya
    |

    హైదరాబాద్ : సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలో నటించటానికి చిన్నా, పెద్దా తేడాలేకుండా అంతా ఆసక్తి చూపుతూంటారు. ఎందుకంటే ఆయనతో కలిసి పనిచేయటం అనేది చాలా మంది కల, అలాగే ఆయన సినిమాలో నటిస్తే వచ్చే మైలేజ్ కూడా ఓ రేంజిలో ఉంటుంది. కానీ కొందరు యంగ్ హీరోలు మాత్రం అవన్నీ డోన్ట్ కేర్ మాకు ఇంట్రస్ట్ లేదు అని చెప్పి పవన్ ని రిజస్ట్ చేసారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

    <strong>ఇంట్లోనే ఉంటూ.... పవన్ ని బావా అని పిలుస్తుందిట...సరసాలు, సరదాలు</strong>ఇంట్లోనే ఉంటూ.... పవన్ ని బావా అని పిలుస్తుందిట...సరసాలు, సరదాలు

    పవన్ కళ్యాణ్ తాజాగా చేస్తున్న చిత్రం కాటమరాయుడు. ఈ చిత్రం తమిళ చిత్రం వీరమ్ కు రీమేక్ లాంటిది. ఈ సినిమాకు పవన్ కు నలుగురు తమ్ముళ్లు ఉంటారు. ఈ తమ్ముళ్లుగా పవన్ తెలుగులో నోటెడ్ అయిన చిన్న హీరోలను తీసుకుందామని నిర్ణయించుకున్నారట. ఆయన మాట మేరకు దర్శక,నిర్మాతలు యంగ్ హీరోలను కలసారట.

    <strong>వర్షం దెబ్బకే ఆగిన పవన్, ఈ రోజు నుంచే మొదలెట్టాడు...ఇక రచ్చే</strong>వర్షం దెబ్బకే ఆగిన పవన్, ఈ రోజు నుంచే మొదలెట్టాడు...ఇక రచ్చే

    Young Heroes'twist to Pawan Kalyan!

    యంగ్ హీరోలు శర్వానంద్, రాజ్ తరుణ్, పెళ్లి చూపులు హీరో విజయ్ దేవరకొండ, నవీన్ చంద్ర,కమల్ కామరాజులను కలిస్తే....కేవలం కమల్ కామరాజు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మిగతావారంతా డేట్స్ ఖాళీలేవని తప్పించుకున్నారట. ఇది రేర్ ఆపర్టునిటీ అయినా మినిమం 50 రోజులు పాటు బల్క్ డేట్స్ ఇవ్వటానికి ఎవరూ సిద్దంగా లేకపోవటమే ఈ సినిమాలో చేయకపోవటానికి కారణం అని చెప్తున్నారు. అంతేకాకుండా ఎవరి పాత్ర కూడా రిజిస్టర్ అయ్యేది కాదని, పెద్ద సీన్స్ ఉండవని అంటున్నారు.

    English summary
    In Katamarayudu Pawan Kalyan having four kid brothers. Since Pawan wanted to have noted heroes as his younger brothers, the makers said to have approached happening heroes in the younger lot but it didn't work.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X