»   » వైయస్ జగన్ హెల్ప్...జూనియర్ ఎన్టీఆర్‌ కి కలిసొచ్చింది? ఫ్యాన్స్ హ్యాపీ

వైయస్ జగన్ హెల్ప్...జూనియర్ ఎన్టీఆర్‌ కి కలిసొచ్చింది? ఫ్యాన్స్ హ్యాపీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివల కాంబినేషన్‌లో వచ్చిన 'జనతా గ్యారెజ్' సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్యన సెప్టెంబర్ 1న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే పలుచోట్ల రికార్డు కలెక్షన్స్ సాధించి ఎన్టీఆర్ కెరీర్లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఈ నేపధ్యంలో ఓ వార్త ఇప్పుడు మీడియాలో హల్ చల్ చేస్తోంది. అది మరేదో కాదు..వైయస్ జగన్..జూనియర్ కలెక్షన్స్ కు సాయిపడ్డారని.

అదేంటి...జూనియర్ ఎన్టీఆర్‌కు జగన్ సహాయం చేయడమేంటని ఆశ్చర్యపోకండి. వైయస్ జగన్ డైరక్ట్ గా జూనియర్ ఎన్టీఆర్‌కు సహాయం చేయలేదు. బంద్ రూపంలో సహకరించారనేది ట్రేడ్ టాక్.


వైయస్ జగన్ బంద్ ప్రకటిస్తే జూనియర్ ఎన్టీఆర్‌కు వచ్చిన లాభం గురించే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్షం వైసీపీతో పాటు అన్ని పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే బంద్ రోజు అన్నీ మూతపడతాయి. కానీ అత్యవసర సేవలు, థియేటర్లు మూతపడలేదు.


YS Jagan helps Junior NTR big time

శనివారం బంద్ కావడంతో ప్రైవేటు, గవర్నమెంట్ ఉద్యోగులు చాలామంది ఖాళీగా ఉన్నారు. ఈ అంశమే జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ సినిమాకు కలిసొచ్చింది. బంద్ కావడంతో ఉద్యోగులంతా ఫ్యామిలీలతో హ్యాపీగా థియేటర్లకు క్యూ కట్టారు.


దాంతో జనతాగ్యారేజ్ థియేటర్లన్నీ కళకళలాడి కలెక్షన్స్ వర్షం కురిసింది. అయితే వీకెండ్ అనేది కూడా అఫ్ కోర్స్ బంద్ లేకపోయినా కలిసొచ్చే అంశంమే. అయితే వీకెండ్ రోజున ఫస్ట్ షో, సెకండ్ షోలు హౌస్ ఫుల్ అవుతాయి.అయితే బంద్ రోజున అన్ని షోలు ఫుల్ అయ్యాయని ట్రేడ్ వర్గాల సమాచారం.


ఇక బాక్సాఫీస్ వద్ద పది రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ పదిరోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటక, యూఎస్‌లలో సినిమా సూపర్ కలెక్షన్స్ సాధించింది.


మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించగా, మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఇక తాజాగా రెండు కొత్త సన్నివేశాలను జత చేయడంతో కలెక్షన్స్ పెరిగే సూచనలున్నాయని ట్రేడ్ భావిస్తోంది.

English summary
Jagan Mohan Reddy had helped NTR and his recent film, Janatha Garage. The Bandh call given by YSR Congress helped Janatha Garage immensely.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu