For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ‘యాత్ర’ మూవీ సెన్సేషన్: స్క్రీన్‌పై వైఎస్ జగన్? క్లైమాక్స్‌లో గుండె పిండేసే...

  |
  YSR Bio Pic : YS Jagan Mohan Reddy To Act In Movie?? | Filmibeat Telugu

  దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'యాత్ర'. ఇందులో వైఎస్ఆర్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కనిపించనున్నారు. ముఖ్యమంత్రి కావడానికి ముందు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ చేసిన పాదయాత్రను ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ మూవీ రూపొందుతోంది.

  ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో నటిస్తున్న వారి వివరాలు వెల్లడయ్యాయి కానీ వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి పాత్రలో నటించేది ఎవరు? అనేది రివీల్ కాలేదు. గతంలో కొందరి పేర్లు వినిపించినా ఎవరూ ఫైనల్ కాలేదు. తాజాగా ఇందుకు సంబంధించి ఓ ఆసక్తికర ప్రచారం తెరపైకి వచ్చింది.

  వైఎస్ జగన్ పాత్రలో ఆయనే కనిపిస్తారా?

  వైఎస్ జగన్ పాత్రలో ఆయనే కనిపిస్తారా?

  వైఎస్ జగన్ పాత్రను ఎవరితో చేయించినా అది సూటవ్వద్దని భావించిన దర్శకుడు మహి వి రాఘవన్... స్వయంగా ఆయన్నే సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

  వైఎస్ జగన్ కెమెరా ఫేస్ చేశారా?

  వైఎస్ జగన్ కెమెరా ఫేస్ చేశారా?

  రాజకీయాలతో బిజీగా ఉండే వైఎస్ జగన్ ఈ సినిమాలో నటించారా? కెమెరా ఫేస్ చేశారా? అంటే... అలాంటిదేమీ లేదట. అయితే సినిమా క్లైమాక్స్‌లో రియల్ ఫుటేజీ ప్రదర్శించబోతున్నారట.

  గుండెల్ని పిండేసే వీడియో...

  గుండెల్ని పిండేసే వీడియో...

  ఈ చిత్రం పూర్తిగా 2004లో వైఎస్ చేసిన పాద యాత్ర నేపథ్యంలో సాగినప్పటికీ... క్లైమాక్స్‌లో 20 నిమిషాల పాటు వైఎస్ఆర్ మరణం, ఇడుపులపాయలో జరిగిన అంత్యక్రియలు చూపించబోతున్నట్లు టాక్. ఈ వీడియో ఫుటేజీలో వెస్ జగన్ కనిపిస్తారని తెలుస్తోంది. ఈ రియల్ వీడియో ఫుటేజీ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసేలా ఉంటుందట.

  ఇతర పాత్రల్లో...

  ఇతర పాత్రల్లో...

  మమ్ముట్టి(వైఎస్ఆర్), రావ్ రమేష్, జగపతిబాబు(వైఎస్ రాజారెడ్డి), సుహాసిని(సబితా ఇంద్రారెడ్డి), అనసూయ(గౌరు చరితారెడ్డి), పోసాని, సచిన్ కడ్కర్, ఆశ్రిత వేముగంటి(వైఎస్ విజయమ్మ), వినోద్ కుమార్, జీవా, 30 ఇయర్స్ పృథ్వి ముఖ్య పాత్రలు పోషించారు.

  యాత్ర

  యాత్ర

  ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళం, మ‌ళ‌యాలంలో 'యాత్ర' ఫిబ్ర‌వ‌రి 8న రిలీజ్ కాబోతోంది. ఈచిత్రానికి సినిమాటోగ్రాఫర్ - సత్యన్ సూర్యన్, మ్యూజిక్ - కె ( క్రిష్ణ కుమార్ ), ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్, సాహిత్యం - సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ప్రొడక్షన్ డిజైన్ - రామకృష్ణ, మోనిక సబ్బాని, సౌండ్ డిజైన్ - సింక్ సౌండ్, సమర్పణ - శివ మేక, బ్యానర్ - 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్, నిర్మాతలు - విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - మహి వి రాఘవ్.

  English summary
  Several film stars were rumoured to have played the role of Jagan in Yatra, but the latest update is that YS Jagan Mohan Reddy will seen in his character on the screen. Some reports are under circulation that the original footage of YSR will be presented in last 20 minutes. So, in that footage, Jagan will be seen at the funeral procession of YSR.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more