»   » ఇలియానాను చేపగా మారుస్తున్న వైవియస్ చౌదరి

ఇలియానాను చేపగా మారుస్తున్న వైవియస్ చౌదరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

సలీంతో డిజాస్టర్ డైరక్టర్ తో మరోమారు ప్రూవ్ చేసుకున్న వైవియస్ చౌదరి తాజాగా ఓ సోషియో ఫాంటసీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తన గురువు రాఘవేంద్రరావు రూటులోకి వెళ్ళి సాహస వీరుడు..సాగర కన్య మాదిరి చిత్రాన్ని రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. దానికి నాలుగేళ్ళ క్రితం ఈ కాన్సెప్టుతో రిలీజైన ఓ హాలీవుడ్ సినిమాని దగ్గర పెట్టుకుని స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు వినపడుతోంది. అందులోనూ రాఘవేంద్రరావు కుమారుడు సూర్య ప్రకాష్ దర్శకత్వంలో సిద్దార్ధ,శ్రుతి హాసన్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం కూడా ప్రేరణ ఇచ్చిందంటున్నారు. అయితే ఏ కథ మార్చినా హీరోయిన్ గా మాత్రం ఇలియానానే తీసుకోవాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇలియానా కూడా తనను తెలుగులో పరిచయం చేసిన చౌదరి అంటే అభిమానం చూపెడుతుందని తెలుస్తోంది. అంటే త్వరలో చేప రూపంలో ఇలియానా తన అందచందాలు పరవనుందన్నమాట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu