»   »  పవన్ కళ్యాణ్ పవర్ చెప్తూ...ప్రమోషన్ సాంగ్

పవన్ కళ్యాణ్ పవర్ చెప్తూ...ప్రమోషన్ సాంగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ టచ్ ఇప్పుడు గోల్డెన్ టచ్ గా మారింది. ఆయన్ను ఆడియో పంక్షన్ కి ఆహ్వానించినా, లేక ఆయన చేత తమ చిత్రానికి రెండు మాటలు చెప్పించుకున్నా ప్లస్ అవుతాయని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు. దాంతో ఇప్పుడు వైవియస్ చౌదరి సైతం అదే స్ట్రాటజీని ఫాలో అయ్యే అలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తన తాజా చిత్రం రేయ్ కోసం పవన్...పవన్ ని వివరిస్తూ ప్రమోషన్ సాంగ్ ప్లాన్ చేసారని, ఇప్పటికే చంద్రబోస్ చేత ఆ పాట రాయించారని తెలుస్తోంది. ప్లాటినం డిస్క్ ఫంక్షన్ లో దీన్ని విడుదల చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఈ మేరకు షూటింగ్ కూడా పెట్టుకుంటున్నట్లు సమాచారం.

వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ 'ఇటీవలి కాలంలో యూత్‌ని టార్గెట్ చేస్తూ క్లాస్, ఫాస్ట్‌ఫుడ్ తరహా లవ్‌స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే 'దేవదాసు', 'దేశముదురు' తరహాలో భారీ స్థాయి మాస్, యూత్ లవ్‌స్టోరీలు రావడంలేదు. ఆ లోటుని తీర్చేవిధంగా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే రీతిలో 'రేయ్' తయారవుతోంది. కథానుగుణంగా ఈ చిత్రం ప్రథమార్థం వెస్టిండీస్ సంస్కృతి నేపథ్యంలో, ద్వితీయార్థం అమెరికా సంస్కృతి నేపథ్యంలో ఉంటుంది.

 Yvs Chowdary tribute to Pawan Kalyan

ఎఫ్.డి.సి. నిబంధనలకనుగుణంగా అమెరికా, వెస్టిండస్‌లో కొంత భాగం, హైదరాబాద్‌లో అత్యధిక భాగం షూటింగ్ చేశాం. భారీ నిర్మాణ విలువలు, ఆసక్తికరమైన కథాకథనాలతో పాటు అద్భుతమైన వినోదంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. తొలి సినిమాతోనే సాయిధరమ్ తేజ్ కచ్చితంగా స్టార్ హీరో అవుతాడనే నమ్మకం ఉంది. అలాగే సయ్యామి ఖేర్ తన అందంతో యూత్‌ని ఆకట్టుకుంటుంది. శ్రద్ధాదాస్ పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. ఇక పాటలన్నీ సందర్భోచితంగా, నాదైన గ్రాండియర్ స్టయిల్‌లో ఆకట్టుకుంటాయి' అని తెలిపారు.

చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ కన్నా ఈ మేనల్లుడిలోనే చిరు పోలికలు బాగా ఉన్నాయి చిరంజీవి నట వారసత్వాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోగల సత్తా సాయి ధరమ్ తేజకే ఉన్నాయనిపిస్తోందన్న వాదనలను కూడా తీసుకవస్తున్నారు. చిత్రంలో అర్పిత్‌ రాంకా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, అలీ, నరేష్‌, జె.పి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: చక్రి, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: గుణశేఖరన్‌.

English summary

 YVS Chowdary is planning to shoot a promotional song on the power of Pawan Kalyan and release it just after the platinum disc event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu