twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైవియస్ చౌదరి ఇలా ఇరుక్కపోయాడేంటి

    By Srikanya
    |

     Yvs Chowdary warning from Mega Camp
    హైదరాబాద్ : వైవియస్ చౌదరి కి మెగా క్యాంప్ వార్నింగ్ ఇచ్చిందా అంటే అవుననే చెప్పుకుంటున్నాయి సినీ వర్గాలు. వార్నింగ్ అంటే మరొ రకంగా ఊహించకండి. మీరు రేయ్ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారా లేక మా పిల్లా నువ్వు లేని జీవితం విడుదల చేయమంటావా అని నిక్కచ్చిగా నిలదీసి అడిగారని సమాచారం. అయితే పిల్లా నువ్వు లేని జీవితం చిత్రం మొదటి రిలీజై,అది హిట్టైతే తన రేయ్ చిత్రానికి ఖచ్చితంగా మంచి క్రేజ్ వస్తుంది. అయితే ఇక్కడో సమస్య ఉంది. తన రేయ్ చిత్రమే ..సాయి ధరమ్ తేజ చిత్రం అనే క్రెడిట్ తో విడుదల కాదు. ఆ క్రేజ్ మిస్సవుతుంది. దాంతో ఏ నిర్ణయం తీసుకోవాలనే డైలమాలో వైవియస్ చౌదరి ఉన్నారని చెప్పుకుంటున్నారు.

    ప్రతీసారీ ఏదో ఒక కారణం చెప్పి సినిమా రిలీజ్ ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు వైవియస్ చౌదరి. ఆయన తాజా చిత్రం రేయ్ ని ఈ సారి ఎట్టిపరిస్ధితుల్లోనూ మే 9 న విడుదల చేద్దామని నిర్ణయించుకున్నామని అన్నారు. అయితే విక్రమ్ సింహా వస్తోందని వైవియస్ చౌదరి తన నిర్ణయాన్ని మార్చుకుని సినిమాని వాయిదా వేసారు. అంతేకాక ఎలక్షన్స్ రిజల్ట్స్ మే 12,13 లలో ఎనౌన్స్ చేసే నేపధ్యంలో తన చిత్రం పై ప్రేక్షకుల దృష్టి ఎంతవరకూ ఉంటుందని అంచనా వేసి, ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నాడంటున్నారు. అయితే ఈ విషయమై అఫీషియల్ గా ప్రకటన ఏమీలేదు.

    వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ 'ఇటీవలి కాలంలో యూత్‌ని టార్గెట్ చేస్తూ క్లాస్, ఫాస్ట్‌ఫుడ్ తరహా లవ్‌స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే 'దేవదాసు', 'దేశముదురు' తరహాలో భారీ స్థాయి మాస్, యూత్ లవ్‌స్టోరీలు రావడంలేదు. ఆ లోటుని తీర్చేవిధంగా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే రీతిలో 'రేయ్' తయారవుతోంది. కథానుగుణంగా ఈ చిత్రం ప్రథమార్థం వెస్టిండీస్ సంస్కృతి నేపథ్యంలో, ద్వితీయార్థం అమెరికా సంస్కృతి నేపథ్యంలో ఉంటుంది.

    ఎఫ్.డి.సి. నిబంధనలకనుగుణంగా అమెరికా, వెస్టిండస్‌లో కొంత భాగం, హైదరాబాద్‌లో అత్యధిక భాగం షూటింగ్ చేశాం. భారీ నిర్మాణ విలువలు, ఆసక్తికరమైన కథాకథనాలతో పాటు అద్భుతమైన వినోదంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. తొలి సినిమాతోనే సాయిధరమ్ తేజ్ కచ్చితంగా స్టార్ హీరో అవుతాడనే నమ్మకం ఉంది. అలాగే సయ్యామి ఖేర్ తన అందంతో యూత్‌ని ఆకట్టుకుంటుంది. శ్రద్ధాదాస్ పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. ఇక పాటలన్నీ సందర్భోచితంగా, నాదైన గ్రాండియర్ స్టయిల్‌లో ఆకట్టుకుంటాయి' అని తెలిపారు.

    చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ కన్నా ఈ మేనల్లుడిలోనే చిరు పోలికలు బాగా ఉన్నాయి చిరంజీవి నట వారసత్వాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోగల సత్తా సాయి ధరమ్ తేజకే ఉన్నాయనిపిస్తోందన్న వాదనలను కూడా తీసుకవస్తున్నారు. చిత్రంలో అర్పిత్‌ రాంకా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, అలీ, నరేష్‌, జె.పి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: చక్రి, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: గుణశేఖరన్‌.

    English summary
    
 
 Mega camp is asking Chowdary to release Rey as soon as possible or they will release Pilla Nuvvu Leni Jeevitham prior to it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X