twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    #SaveNallamala: కేటీఆర్ రిప్లై... అయినా పోరాటం ఆపొద్దంటున్న విజయ్ దేవరకొండ!

    |

    నల్లమల అడవుల్లో యూరేనియం తవ్వకాల ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్లూ #SaveNallamala ఉద్యమం సోషల్ మీడియాలో విస్తృతం అయింది. ఇక్కడ యూరేనియం మైనింగ్ జరిగితే జంతు జాలం, వృక్షజాలం నాశనం అవుతుందని, అడవులను నరికి తవ్వకాలు చేపట్టడం ద్వారా మానవాళిపై తీవ్ర ప్రభావం పడుతుందని, దీంతో పాటు పురాతన చెంచు తెగ అంతరించిపోతుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉద్యమానికి సినీ తారల మద్దతు కూడా లభించడంతో వారి అభిమానులు సైతం ఇందులో భాగం అయ్యారు. పవర్ స్టార్‌తో సహా పలువురు స్టార్లు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు

    ఘాటైన వ్యాఖ్యలతో ఆకట్టుకున్న విజయ్

    ఇప్పటికే మనం చాలా వరకు పర్యావరణం నాశనం చేశాం. యూరేనియం కావాలంటే కొనుక్కోవచ్చు.... కానీ అడవులను కొనగలమా? అంటూ తనదైన శైలిలో ఘాటుగా కామెంట్స్ చేసి విజయ్ దేవరకొండ హాట్ లాపిక్ అయ్యారు. తాజాగా కేటీఆర్ నుంచి రిప్లై రావడంతో విజయ్ మరోసారి రియాక్ట్ అయ్యారు.

    కేటీఆర్ ట్వీట్

    ‘‘నల్లమల అడవుల్లో యూరేనియం తవ్వకాల అంశంపై సోషల్ మీడియా ద్వారా, ఇతర మార్గాల ద్వారా ప్రజల అభిప్రాయాలు విన్నాను. ఈ విషయం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో వ్యక్తిగతంగా చర్చిస్తాను'' అంటూ ట్వీట్ చేశారు.

    ఇది తొలి విజయం, ప్రయత్నం ఆపొద్దు

    కేటీఆర్ ట్వీటుపై విజయ్ దేవరకొండ రియాక్ట్ అవుతూ.... ‘ఇది మన తొలి విజయం... మనమంతా కలిసి వినిపించిన అభిప్రాయాలపై తగిన చర్యలు తీసుకోబోతున్నారు. ఇది పూర్తయ్యే వరకు మన ప్రయత్నం, పోరాటం ఆపొద్దు, అమ్రామాద్ ప్రజలకు మా మద్దతు ఉంటుంది. నల్లమల రక్షణ కోసం బేషరుతుగా మద్దతుగా ఉంటాం' అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.

    సేవ్ నల్లమల

    సేవ్ నల్లమల

    తెలంగాణ ప్రాంతంలో దాదాపు 20 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవుల్లో యూరేనియం తవ్వకాల కోసం ప్రయత్నాలు మొదలైన నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో ఆందోళన వ్యక్తం అవుతోంది. యూరేనియం తవ్వకాలు మొదలైతే భూమి, నీరు కాలుష్యం అవుతుందని, ఇది మనుషులపైనే కాకుండా జంతు, వృక్షజాలంపై తీవ్రం ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

    English summary
    "1st win :) We came together, We have been heard, and steps are being taken, now let's not stop till we #SaveNallamala completely. All the people of Amrabad - Nallamalla you have my unconditional support and the support of million other brothers and sisters of yours." Vijay Deverakonda tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X