For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  47 Years Of NBK: వెండితెరపై అసలైన నట సింహం.. ఆ బాక్సాఫీస్ లెక్కలు మైండ్ బ్లోయింగ్!

  |

  సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ బలంగా ఉన్నంత మాత్రనా స్టార్ హీరోగా క్రేజ్ అందుకుంటారు అనేది ఎంతమాత్రం నిజం కాదు. అందుకు అన్ని సినిమాల ఇండస్ట్రీలో కూడా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. హీరోగా సక్సెస్ అవ్వాలంటే ఎంతటి వారికైనా సరే కాస్త అదృష్టంతో పాటు కష్టపడే గుణం కూడా ఉండాలని అంటారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి రెండవ తరం వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ ఏ స్థాయిలో గుర్తింపు అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

  సినిమాల్లోకి వచ్చి నేటితో 47 సంవత్సరాలు అవుతోంది. నందమూరి బాలకృష్ణ నటించిన మొదటి సినిమా సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. తాతమ్మకల అనే ఆ సినిమా నందమూరి బాలకృష్ణ నట జీవితానికి ఒక మంచి దారిని ఏర్పాటు చేసింది. ఇక సోషల్ మీడియాలో అభిమానులు బాలకృష్ణ 47 వసంతాల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.

  ఎలాంటి సినిమా చేసినా కూడా

  ఎలాంటి సినిమా చేసినా కూడా

  నందమూరి తారక రామారావు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనంతరం స్టార్ హోదా ను అందుకోవడానికి చాలానే కష్టపడ్డారు. అనంతరం ఆయన వారసులు కూడా ఒక్కొక్కరు ఒక్కో విభాగంలో వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నారు. ఏడు మంది కొడుకులు తప్పకుండా నలుగురు అయినా సరే స్టార్ హీరోలుగా గుర్తింపు అందుకుంటారు అని అందరూ అనుకున్నారు.

  కానీ నందమూరి బాలకృష్ణ, హరికృష్ణ మాత్రమే ఇందులో నందమూరి వంశాన్ని నిలబెట్టే విధంగా అడుగులు వేశాడు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోల్లో బాలకృష్ణ ఒకడిగా కొనసాగుతూ వచ్చాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లను అందుకుంటున్నాయి.

  మొదటి సినిమాకు 47 ఏళ్ళు

  మొదటి సినిమాకు 47 ఏళ్ళు

  నందమూరి బాలకృష్ణ ఇప్పటివరకు వందకు పైగా సినిమాలు చేశాడు. మరొక రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే నందమూరి బాలకృష్ణ తన మొదటి సినిమాను తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలోని చేశాడు. 1974 లో ఎన్టీఆర్ డైరెక్ట్ చేయడమే కాకుండా నిర్మించిన చిత్రం తాతమ్మకల. ఈ సినిమా వచ్చి నేటికి 47 సంవత్సరాలు అవుతోంది.

  నందమూరి తారక రామారావుతో పాటు భానుమతీ రామకృష్ణ నందమూరి, బాలకృష్ణ ఈ సినిమాలో ఓ కీలక పాత్రల్లో నటించారు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

  ఎక్కువగా తండ్రీతోనే..

  ఎక్కువగా తండ్రీతోనే..

  ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ మంచి హీరో అవుతాడని అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. తాతమ్మ కల సినిమా తర్వాత అదే ఏడాది రామ్ రహీమ్ అనే మరొక సినిమా చేశాడు. ఇక ఆ తర్వాత 1975 లో అన్నదమ్ముల అనుబంధం, వేములవాడ భీమకవి అనే సినిమాలు చేశాడు. ఓ వైవు చదువుకుంటూనే మరోవైపు ఖాళీ సమయంలో సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. నందమూరి బాలకృష్ణ ఎక్కువగా తన తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకుంటూ వచ్చాడు.

  ఏడాదికి నాలుగైదు సినిమాలు

  ఏడాదికి నాలుగైదు సినిమాలు

  ఇక 1984లో సాహసమే జీవితం అనే సినిమాతో సోలో హీరోగా వెండితెరకు సరికొత్త గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా తర్వాత ఒకేసారి 7 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద హిట్స్ అందుకుంటున్నాడు అని దర్శక నిర్మాతలతో సినిమాలు చేసేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. 1990 వరకు కూడా బాలకృష్ణ ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసుకుంటూ వచ్చేవారు. ఇక మెల్లగా తన స్టార్ హోదా పెరగడంతో 2000 సంవత్సరం తర్వాత ఏడాదికి రెండు లేదా ఒక్క సినిమా మాత్రమే చేసుకుంటూ వచ్చారు.

  బాలయ్య బాక్సాఫీస్ ట్రాక్

  బాలయ్య బాక్సాఫీస్ ట్రాక్

  ముద్దుల కృష్ణయ్య, లారీ డ్రైవర్, ఆదిత్య369, సమరసింహా రెడ్డి, ముద్దుల మామయ్య, భైరవ ద్వీపం, నరసింహ నాయుడు సింహ, లెజెండ్, గౌతమి పుత్ర శాతకర్ణి.. వంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలను చేశాడు. బాలకృష్ణ సినిమా కెరీర్ లో నాలుగు సూపర్ హిట్స్ ఉండగా 13 హిట్స్ ఉన్నాయి. ఇండస్ట్రీ హిట్స్ మూడు సినిమాలు ఉన్నాయి. బ్లాక్ బస్టర్ హిట్స్ ఆరు సినిమాలు ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం వసూళ్లను అయితే అందుకుంటూ వస్తున్నాయి.

  అతిథి పాత్రల్లో కూడా

  అతిథి పాత్రల్లో కూడా

  కొన్ని సందర్భాల్లో బాలకృష్ణ అతిథి పాత్రలో కూడా నటించిన విషయం తెలిసిందే. మంచు మనోజ్ ఉ కొడతారా ఉలిక్కిపడతారా సినిమాలో నందమూరి బాలకృష్ణ ఒక పవర్ఫుల్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది. అయినప్పటికీ బాలకృష్ణ మంచి పాత్రలు వస్తే మాత్రం గెస్ట్ రోల్ చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను అంటూ వివరణ ఇచ్చారు.

  బాలకృష్ణ వారసుడు

  బాలకృష్ణ వారసుడు

  నేటి తరం హీరోలలో పౌరాణిక సినిమాలు చేయగలిగే సత్తా ఉన్న అతికొద్ది మంది హీరోలలో బాలయ్య ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. త్వరలోనే ఆయన వారసుడిని కూడా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురాబోతున్నారు. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న ఆదిత్య 999 ద్వారా వెండితెరకు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ సినిమా బాలకృష్ణ స్వీయ దర్శకత్వం వహిస్తారని సమాచారం. మరి ఆ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

  English summary
  47 Years Of nandamuri balakrishna cinema career
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X