For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR నుంచి రామ్ చరణ్ పిక్ లీక్: అల్లూరి లుక్‌ను రివీల్ చేస్తూ.. గుడ్ న్యూస్ చెప్పిన స్టైలిస్ట్

  |

  'బాహుబలి'తో తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి. అంతటి భారీ హిట్ సిరీస్ తర్వాత ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). తెలుుగ సినీ ఇండస్ట్రీలోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు మిగిలిన ప్రాంతాలకు చెందిన వాళ్లంతా వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా గురించి ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ చేసిన ట్వీట్ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని పెంచేస్తోంది. అలాగే ఆయన చరణ్ లుక్‌ను కూడా లీక్ చేశాడు. ఆ సంగతులు మీకోసం!

  రియల్ హీరోల కథతో స్టార్ హీరోలు

  రియల్ హీరోల కథతో స్టార్ హీరోలు

  స్వాతంత్ర్యానికి పూర్వం ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిన విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రూపొందుతోన్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్, హీరోయిన్లు. ఇందులో చరణ్.. అల్లూరిగా, తారక్.. భీంగానూ చేస్తున్నారు.

  మూడేళ్లైనా పూర్తవని మూవీ షూట్

  మూడేళ్లైనా పూర్తవని మూవీ షూట్

  RRR మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై దాదాపు మూడేళ్ల వరకూ అవుతోంది. అయినప్పటికీ ఈ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా గత ఏడాది, ఈ సంవత్సరం మాత్రం కరోనా వైరస్ ప్రభావంతో చిత్రీకరణ నిలిచిపోయింది. దీంతో ఈ మూవీ షూట్ ఎప్పటికి పూర్తవుతుందన్న దానిపై క్లారిటీ మాత్రం రావడం లేదు.

  రెండూ రికార్డులు క్రియేట్ చేసేశాయి

  రెండూ రికార్డులు క్రియేట్ చేసేశాయి

  RRR మూవీపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. అందుకే దీని నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా ట్రెండ్ సెట్ చేస్తోంది. ఈ మూవీ నుంచి మొదటిగా టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. ఆ తర్వాత రామ్ చరణ్ ‘భీం ఫర్ రామరాజు', ఎన్టీఆర్ ‘రామరాజు ఫర్ భీం' విడుదలయ్యాయి. వీటికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో రికార్డులు క్రియేట్ అయ్యాయి.

  రిలీజ్ డేట్‌పై పుకార్లు.. చివరికి అదే

  రిలీజ్ డేట్‌పై పుకార్లు.. చివరికి అదే

  వాస్తవానికి RRR మూవీని జూలై 30, 2020న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, అనుకున్న తేదీకి చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో జనవరి 8, 2021న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. కానీ, ఇప్పుడు కూడా అదే పరిస్థితి వల్ల అక్టోబర్ 13, 2021న విడుదల చేస్తున్నట్లు చెప్పారు. అయితే, ఇది మారుతుందని అంటున్నా.. అదే కన్ఫార్మ్ అయ్యేలా ఉంది.

  RRR మూవీ గురించి గుడ్ న్యూస్

  RRR మూవీ గురించి గుడ్ న్యూస్

  RRR మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుందని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే నేటి నుంచి తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తేశారు. దీంతో షూటింగులకు సైతం అడ్డంకులు తొలిగిపోయాయి. ఈ నేపథ్యంలో RRR మూవీ షూటింగ్ ప్రారంభం అవుతోంది. ఈ విషయాన్ని ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ ట్వీట్ ద్వారా తెలిపాడు.

  Actor Altaf Hassan About His Struggles | Battala Ramaswami Biopikku
  RRR నుంచి రామ్ చరణ్ పిక్ లీక్

  RRR నుంచి రామ్ చరణ్ పిక్ లీక్

  ఆలిమ్ హకీమ్ తాజాగా తన ట్విట్టర్‌లో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు లుక్‌కు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశాడు. అలాగే, ‘ఈరోజు నుంచి హైదరాబాద్‌లో లాక్‌డౌన్ తీసేశారు. దీంతో అన్ని సినిమాల షూటింగ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ ఉదయం రామ్ చరణ్‌కు హెయిర్ కట్ చేయడం ద్వారా నా రోజు ప్రారంభం అయింది' అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ పిక్ వైరల్ అవుతోంది.

  English summary
  Famous Hair Stylist Aalim Hakim Now Tweet About RRR Movie Shooting. Then He Reveal Ram Charan's Alluri Seetaramaraju Look. This Pic Gone Viral
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X