For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దిల్ రాజు మాటను అప్పుడు కంప్లీట్‌గా నమ్మలేం, ఆ రోజు కాల్ వస్తేనే నమ్మాలి: నాని

|
Actor Nani Speech at Jersey Appreciation Meet || Filmibeat Telugu

నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్ జంట‌గా సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన చిత్రం జెర్సీ. ఏప్రిల్ 19న విడుద‌లైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది.

చాలా కాలం తర్వాత తెలుగులో ఒక మంచి సినిమా వచ్చిందనే అభిప్రాయం ప్రతి ఒక్కరి నుంచి వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి కారణమైన చిత్ర బృందాన్ని అభినందించడానికి అప్రిషియేట్ మీట్ ఏర్పాటు చేశారు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు. ఈ సందర్భంగా నాని ప్రసంగం ఆకట్టుకుంది.

దిల్ రాజు తెలుగు సినిమాకు బీసీసీఐ లాంటి వారు

దిల్ రాజు తెలుగు సినిమాకు బీసీసీఐ లాంటి వారు

‘జెర్సీ' సినిమా కథ విన్నపుడే నాకు అద్భుతంగా అనిపించింది. ఈ సినిమాలో బీసీసీఐ అర్జున్ కోసం ఈవెంట్ ప్లాన్ చేసినట్లు జెర్సీ టీంకు దిల్ రాజుగారు దీన్ని ప్లాన్ చేశారు. ఆయన తెలుగు సినిమాకు బీసీసీఐ లాంటివారు.. అని నాని చెప్పుకొచ్చారు.

దిల్ రాజు నుంచి ఫోన్ వస్తే హిట్టే

దిల్ రాజు నుంచి ఫోన్ వస్తే హిట్టే

ఏదైనా సినిమా రిలీజ్ రోజు ఉదయం 9 గంటలకు రాజుగారి దగ్గర నుంచి కాల్ వస్తే మన సినిమా హిట్టయినట్లే. రిలీజ్ ముందు సినిమా చూసి బావుందంటారు... కానీ దాన్ని కంప్లీట్‌గా నమ్మలేం. రిలీజ్ రోజు మార్నింగ్ కాల్ వచ్చిందంటే వందశాతం హిట్ అని నమ్మొచ్చు. ‘జెర్సీ' మూవీ రిలీజ్ రోజు నేను ఉదయం ఇంటి గేటు నుంచి బయటకు వస్తున్నపుడే రాజగారి నుంచి కాల్ రాగానే క్లారిటీ వచ్చేసింది.

అందుకే ఇపుడు రివర్స్‌లో

అందుకే ఇపుడు రివర్స్‌లో

మామూలుగా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో టీం మొత్తానికి థాంక్స్ చెప్పుకుంటారు. రిలీజ్ తర్వాత ప్రేక్షకులకు థాంక్స్ చెబుతారు. నేను కాన్ఫిడెంటుగా మీరందరూ గర్వపడే సినిమా అవుతుందని ప్రేక్షకులకు అప్పుడే థాంక్స్ చెప్పాను. ఇపుడు రివర్స్‌లో మా టీంకు థాంక్స్ చెబుతాను.

ఆ మనిషిలో కూడా నిజాయితీ ఉంది

ఆ మనిషిలో కూడా నిజాయితీ ఉంది

గౌతమ్ రాసుకున్న కథలో మాత్రమే కాదు, ఆ మనిషిలో కూడా నిజాయితీ ఉంది. మనం ఊహించుకుని రాసుకునే కథ హానెస్ట్‌గా ఉండాలని మనం అనుకోవడం కాదు, మనం బేసిగ్గా హానెస్టుగా ఉంటే ఆ కథలోకి ఆటోమేటిక్‌గా లైఫ్ వస్తుంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ గౌతమ్. అతడు చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు.

అతడు కథను ఓన్ చేసుకోకపోతే ఆ టెన్షన్ అంత ఉండేది కాదేమో

అతడు కథను ఓన్ చేసుకోకపోతే ఆ టెన్షన్ అంత ఉండేది కాదేమో

నిర్మాత వంశీ ఈ సినిమా కథను ఎంతగా నమ్మాడో, సినిమా బాగా రావాలని ఎంతగా టెన్షన్ పడ్డాడో నాకు తెలుసు. అతడు కథను ఓన్ చేసుకోకపోతే ఆ టెన్షన్ అంత ఉండేది కాదేమో. కెమెరామెన్ సాను తన సినిమాటోగ్రఫీతో కథ చెప్పాడు. తన సినిమాటోగ్రఫీ ఎప్పుడూ సపరేటుగా కనిపించాలని అనుకోలేదు. అనిరుధ్ మ్యూజిక్‌తో కథ చెప్పాడు. ఏ పాట కూడా హిట్టయిపోవాలన్నట్లు ఉండదు. అది సినిమాలో కథను, అందులోని సందర్భాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటుంది.

తాను బ్యాడ్ అవుతానేమో అని టెన్షన్ పడింది

తాను బ్యాడ్ అవుతానేమో అని టెన్షన్ పడింది

మా సారా(శద్ధా శ్రీనాథ్) షూటింగ్ సమయంలో కంగారుపడేది. సినిమాలో అర్జున్ మీద చిరాకుపడ్డప్పుడల్లా నన్ను బ్యాడ్ అనుకుంటారేమో అనుకునేది. కానీ అందరూ నీకు కనెక్ట్ అవుతారు అని చెప్పేవాడిని. అది ఎడ్జ్ మీద ఉండే క్యారెక్టర్. దాన్ని పెర్ఫార్మ్ చేయడం ఎంత కష్టమో నటుడిగా నాకు మాత్రమే తెలుసు. సినిమా రిలీజ్ తర్వాత అందరూ శ్రద్ధాను కూడా పొగుడుతుంటే చాలా సంతృప్తిగా అనిపిస్తుందని నాని చెప్పుకొచ్చారు.

English summary
Actor Nani Speech at Jersey Appreciation Meet. Jersey is a 2019 Telugu-language period sports drama written and directed by Gowtham Tinnanuri which is produced by Suryadevara Naga Vamsi under his production banner Sithara Entertainments. The film stars Nani and Shraddha Srinath in the lead roles while Sanusha, Sathyaraj, Sampath Raj, Brahmaji, Viswant and Ronit Kamra play pivotal roles.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more