For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  MAA Elections..ఆంధ్రావాళ్లు నాన్ లోకల్ అంటే.. సీఎం జగన్‌ను లాగి.. కురుక్షేత్రం అంటూ సుమన్ సంచలన వ్యాఖ్యలు

  |

  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతున్నది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌ స్కూల్‌లో జరుగుతున్న పోలింగ్‌లో పలువురు సినీ నటులు పాల్గొన్నారు. ఈ ఓటింగ్ సందర్భంగా స్వల్ప ఘర్షణలు, వాదనలు పోటీదారుల మధ్య కనిపించాయి. ఈ సందర్భంగా సీనియర్ నటుడు సుమన్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో సుమన్ మాట్లాడుతూ..

  Maha Samudram తారల తళుకు బెళుకులు.. సిద్దార్థ్, శర్వానంద్, అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు సందడి

   తాత్కాలికంగానే ఈ గందరగోళం అంటూ సుమన్

  తాత్కాలికంగానే ఈ గందరగోళం అంటూ సుమన్

  నేను 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. గతంలో కంటే ఈ సారి మా ఎన్నికల్లో రసభాస జరిగింది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఈ వాతావరణం కనిపించదు. ఎన్నికలు అనేవి భావోద్వేగానికి సంబంధించినవి. అందుచేత తాత్కాలికంగా ఈ గందరగోళం కనిపిస్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి సినిమా షూటింగుల్లో పనిచేసుకొంటారు. నాకు అర్ధం కాని విషయం ఏమిటంటే.. మహిళలకు అధ్యక్ష పదవి ఎందుకు ఇవ్వకూడదు. వారి సంఖ్య బాగానే ఉంది. వారి మనోభావాలను గౌరవించాలి అని నటుడు సుమన్ అన్నారు.

  ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత

  ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత

  ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఏపీలో సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. వారి విధానాలు వారివి. తెలంగాణలో ఉన్న నిబంధనలే ఏపీలో రావాలంటే కుదరదు. సినీ పెద్దలు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. అక్కడ కూడా ఫిల్మ్ సిటీ ఏర్పాటు కావాలి. తెలంగాణలో కూడా చిన్న నిర్మాతలకు అనుకూలంగా ఉండేలా సీఎం కేసీఆర్ ఓ ఫిల్మ్ సిటీని నిర్మించాలని కోరుకొంటున్నాను అని సుమన్ అన్నారు

  ఏపీ, తెలంగాణలో పరిస్థితులు వేర్వేరుగా

  ఏపీ, తెలంగాణలో పరిస్థితులు వేర్వేరుగా

  ఏపీ, తెలంగాణలో ఉన్న పరిస్థితులు చాలా వేర్వేరుగా ఉన్నాయి. చిన్న నిర్మాతలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల వారి గురించి ఆలోచించాలి. ఇలానే నిబంధనలు ఉండాలని సీఎంలపై సినీ పరిశ్రమ ఒత్తిడి తీసుకురాకూడదు. ఆయా ప్రభుత్వాల విధానాలకు అనుగుణంగా సినీ పరిశ్రమ నడచుకోవాలి అని సుమన్ పేర్కొన్నారు.

  నాన్ లోకల్, లోకల్ వివాదంపై

  నాన్ లోకల్, లోకల్ వివాదంపై

  మా ఎన్నికల్లో నాన్ లోకల్, లోకల్ అనే వివాదం రావడం చాలా దారుణం. రాష్ట్రం విడిపోయింది. హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్లు ఉన్నారు. వారిని నాన్ లోకల్ అంటే తప్పు.. అలాంటి ఫీలింగ్ ఉండకూడదు. ఇక్కడ ఎవరైతే పుట్టలేదో వాళ్లను నాన్ లోకల్ అనవచ్చు. కానీ అందరూ కలిసి మెలిసి ఉండాలి అని సుమన్ సూచించారు.

  ప్రాంతాలకు అతీతంగా ఉండాలి..

  ప్రాంతాలకు అతీతంగా ఉండాలి..

  తెలంగాణ, హైదరాబాద్‌లో మల్టీ నేషనల్ కంపెనీలు ప్రాంతాలకు అతీతంగా ఉద్యోగాలు ఇస్తున్నారు. ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు, పట్టం కట్టాలి. పక్క రాష్ట్రం నుంచి వచ్చారని లోకల్ కాదంటే ఎలా? కన్నడ రాష్ట్రంలోని బెంగళూరులో చాలా మంది తెలుగు వాళ్లు పనిచేస్తున్నారు? రేపటి రోజున నాన్ లోకల్ అని వాళ్లను టార్గెట్ చేస్తే పరిస్థితి ఏమిటి?. నీవు ఊర్లో నాన్ లోకల్ ఫీలింగ్ ఉంటే మాకు ఉండదా అని అంటే. తెలంగాణ వాళ్లకు సినియారిటి, క్వాలిఫికేషన్ బట్టి ప్రాధాన్యం ఇవ్వాలి అని సుమన్ ప్రశ్నించారు.

  Erra Cheera Making Video
  పోలింగ్ బూతుల వద్ద కురుక్షేత్రం

  పోలింగ్ బూతుల వద్ద కురుక్షేత్రం

  పోలింగ్ బూతుల్లో వాడివేడిగా ఉంది. అక్కడ కురుక్షేత్రం జరుగుతుందా అనే విధంగా పరిస్థితి కనిపించింది. మా ఎన్నికల్లో ఇలాంటి వాతావరణం సహజం. గత కొద్ది సంవత్సరాలుగా ఈ పరిస్థితి కనిపిస్తున్నది. ఎన్నికల సమయంలో ఇలానే ఉంటుంది. ఆ తర్వాత మనం అందరం కలిసి పనిచేయాల్సిందే అని సుమన్ అన్నారు.

  English summary
  Actor Suman sensational comments on Non Local Issue in MAA Elections. He made Objection on Non Local Issue in film Industry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X