For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాజమౌళి గాయాల నుంచి ఇంకా కోలుకోలేకపోతున్న హీరోలు.. వరుసగా సర్జరీలు..

  |

  స్టార్ హీరోగా క్లిక్ అయితే చాలు కోట్లల్లో ఆదాయం వస్తుంది అనేది అందరికి తెలిసిన విషయమే. అయితే ఆ స్థాయికి చేరుకోవాలి అంటే అంత సాధారణమైన విషయం కాదు. లక్ తో పాటు కష్టపడే గుణం కూడా ఉండాలి. ఇక రాజమౌళి లాంటి బడా యాక్షన్ డైరెక్టర్ తో సినిమా చేయడం కూడా సాధారణమైన విషయం కాదు. దాదాపు ఆయనతో వర్క్ చేసిన ప్రతీ హీరో కూడా ఏదో ఒక సందర్భంలో గాయలపాలవ్వడం సహజం. ఇక ఎప్పుడో ఆయన సినిమా షూటింగ్స్ లో గాయపడిన కొందరు హీరోలు ఇంకా కోలుకోవడం లేదని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

  పని రాక్షసుడు

  పని రాక్షసుడు

  రాజమౌళితో సినిమా చేయాలని ప్రతీ టెక్నీషియన్ , యాక్టర్ కు కూడా ఉంటుంది. కానీ ఆయనతో వర్క్ చేయడం అనేది కాస్త సాహసంగానే ఉంటుంది. రాజమౌళి పని రాక్షసుడు అని ఎన్టీఆర్ కూడా చెబుతుంటారు. ఒక్కసారి అగ్రిమెంట్ మీద సంతకం పెడితే స్టార్ హీరో అయినా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా కూడా సీన్ కరెక్ట్ గా వచ్చే వరకు కష్ట పడాల్సిందే. రోజుల తరబడి గంటల తరబడి.. ఆయన ఒక్క 5 సెకన్ల షాట్ కోసం హార్డ్ వర్క్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

  ఎంత జాగ్రత్తగా ఉన్నా..

  ఎంత జాగ్రత్తగా ఉన్నా..

  రాజమౌళి షూటింగ్ విషయాల్లో అంత కఠినంగా ఉంటారు కాబట్టే సినిమాల రిజల్ట్ కూడా పాజిటివ్ గా ఉంటుంది. ఇక రాజమౌళితో యాక్షన్ కు సంబంధించిన సన్నివేశాలలో చాలా వరకు డూబ్ లేకుండానే హీరోలు నటించాల్సి ఉంటుంది. ఇక ఆయన మేకింగ్ విధానంలో ఫైట్స్ లో రియాలిటీకి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. ఈ క్రమంలో హీరోలు చాలా వరకు గాయలపాలవుతారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా దెబ్బ తగలకుండా షాట్ పూర్తి చేయడం కష్టమే.

  అంత ఈజీగా తగ్గవు

  అంత ఈజీగా తగ్గవు

  అయితే రాజమౌళి సినిమాల్లో నటించడం వలన కొన్నిసార్లు హీరోలకు తీవ్రంగా గాయమైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వారు ఆ గాయాల నుంచి కోలుకోవడానికి చాలా ఎక్కువ సమయం కూడా పడుతుంది. అప్పటికప్పుడు ప్రథమ చికిత్సతో ఏదో మేనేజ్ చేసినప్పటికీ కూడా కొంతమంది ఇప్పటికీ కూడా తరచుగా ఆ గాయం తాలూకు నొప్పిని ఎదుర్కోవాల్సి వస్తోంది. కొందరు అయితే సర్జరీలు కూడా చేసుకుంటున్నారు.

   ప్రభాస్ కూడా

  ప్రభాస్ కూడా

  ప్రభాస్ బాహుబలి సినిమాల్లో కోసం ఎంతగా కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా ఉన్నన్ని రోజులు కూడా అతను మరో ప్రాజెక్టు గురించి ఆలోచించలేదు. అయితే బాహుబలి సినిమా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నప్పుడు ప్రభాస్ కు చాలా సార్లు దెబ్బలు తగిలాయి. ఇక అతను మోకాలి నొప్పితో, భుజం నొప్పితో ఇప్పటికి బాధపడుతున్నాడు. ఇటీవల విదేశాలకు వెళ్లి సర్జరీ కూడా చేయించుకోవాల్సి వచ్చింది.

  Recommended Video

  Young Techie12 ఏళ్లకే 3 యాప్స్ తయారు... కోట్లు సంపాదించే ఛాన్స్ *Tech | Telugu OneIndia
  RRR హీరోలు

  RRR హీరోలు

  ఇక RRR సినిమా సమయంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా అనేక సార్లు గాయాలపాలయ్యారు. వారికి దెబ్బలు తాగడం వలన వరుసగా రెండు మూడు సార్లు షూటింగ్ వాయిదా పడింది. ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ సైతం RRR నొప్పిని ఇంకా మోస్తూనే సర్జరీ చేయించుకున్నాడు. ఏదేమైనా రాజమౌళితో బాక్సాఫీస్ హిట్ కొట్టడం కాయమే అయినా షూటింగ్ లో మాత్రం చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పవచ్చు. మరి నెక్స్ట్ మహేష్ బాబును జక్కన్న ఎలా డీల్ చేస్తారో చూడాలి.

  English summary
  After SS Rajamouli movies stars injuries and latest situation
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X