కరోనా ఎఫెక్ట్.. హిట్టు కోసం ప్లాన్ మార్చిన అక్కినేని హీరో!
అక్కినేని యువ హీరో అఖిల్ మొదటి సక్సెస్ అందుకోవడానికి తన శక్తినంతా ధారపోస్తున్నాడు గాని వర్కౌట్ కావడం లేదు. వరుసగా మూడు సినిమాలు దెబ్బకొట్టడంతో నాలుగవ సినిమాతో అయినా మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.
ఇంతకుముందు చేసిన అఖిల్ - హలో - మిస్టర్ మజ్ను సినిమాలు అంతగా ఆడకపోవడానికి గల కారణాలను చూసుకున్న అఖిల్ అవి రిలీజైన సమయం కూడా కరెక్ట్ కాదని ఒక నిర్ణయానికి వచ్చాడట. అందుకే ఎలాగైనా ఈ సారి ఒక పెద్ద పండగ సమయంలో తన నాలుగవ సినిమాను రిలీజ్ చేయాలని టార్గెట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అసలైతే లాక్ డౌన్ లేకుంటే ఈపాటికే సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉండేవారు.

కానీ కరోనా కారణంగా సినిమాను వాయిదా వేయక తప్పడం లేదు. వచ్చే మూడు నెలల వరకు కూడా పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. జనాలు సినిమా థియేటర్స్ కి రావడం అనుమనంగానే మారింది. వచ్చినా ఇంతకు ముందులా హౌజ్ ఫుల్ బోర్డ్స్ కనిపించకపోవచ్చు.
అందుకే అఖిల్ ఆగస్ట్ వరకు కూడా సినిమాను రిలీజ్ చేయకూడదని వచ్చే దసరా సమయంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో అక్కినేని హీరో ఈసారైనా బాక్సాఫీస్ హిట్టు అందుకుంటాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











