For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరొక బిగ్ పార్టీ ఇవ్వబోతున్న అక్కినేని నాగార్జున.. ఫుల్ జోష్ లో యువ హీరోలు!

  |

  అక్కినేని వారి ఫ్యామిలీలో ఎవరికి కూడా సక్సెస్ అనేది అంత ఈజీగా రాలేదు. అక్కినేని నాగేశ్వరరావు బ్రాండ్ ఇమేజ్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాగార్జున కూడా మొదట్లో బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోగా సక్సెస్ అందుకోవడానికి చాలా సమయం పట్టింది. ధైర్యం చేసి కొన్ని ప్రయోగాలు చేయడం వల్లనే నాగార్జున తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఆయన నుంచి వచ్చిన ఇద్దరు కుమారులు కూడా మొదట్లో కాస్త తడబడ్డారు. అక్కినేని నాగ చైతన్య ఎంట్రీ పై అప్పట్లో అంచనాలు ఏ స్థాయిలో పెరిగాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి సినిమా జోష్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో రిలీజ్ అయినప్పటికీ కలెక్షన్స్ మాత్రం అంచనాలకు తగ్గట్టుగా రాలేవు. మొదటి అడుగులోనే అవుఅజయం రావడంతో నాగార్జున అప్పట్లో చాలా అప్సెట్ అయ్యాడు.

  ఇక చిన్న కొడుకు అక్కినేని అఖిల్ కూడా మొదటి మూడు సినిమాలతోనే అపజయాలను కంటిన్యూగా చూడాల్సి వచ్చింది. మొత్తానికి ఇటీవల కాలంలో ఇద్దరు హీరోలు కూడా చాలా మంచి విజయాలను అందుకున్నారు. గత కొంతకాలంగా నాగచైతన్య సెలెక్ట్ చేసుకుంటున్న సినిమాలు కూడా అతనికి కెరీర్ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మజిలి సినిమా తర్వాత వెంకీ మామ కాస్త నిరాశ పరిచినప్పటికీ లవ్ స్టోరీ సినిమాతో భారీ స్థాయిలో బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ సినిమా యూనిట్ సబ్యులకు నాగార్జున ప్రత్యేకంగా పార్టీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు చిన్న కొడుకు అఖిల్ కూడా తన మొదటి విజయాన్ని అందుకోవడంతో అక్కినేని నాగార్జున ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

  Akkineni nagarjuna full happy with akhil MEB succes and planning special party

  ఎందుకంటే మొదటి మూడు సినిమాలు కూడా అఖిల్ ను ఎంతగానో నిరాశపరిచాయి. అతనికి సక్సెస్ చాలా అవసరం అని నాగార్జున ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఫలితం దక్కలేదు. ఇక ఫైనల్ గా అల్లు అరవింద్ మాట మీద నమ్మకంతో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాగ్ ఒప్పుకోక పోయి ఉంటే ఆ సినిమా పట్టాలెక్కేది కాదట. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకోవడమే కాకుండా అతి తక్కువ రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను కూడా పూర్తి చేసింది. దీంతో నాగార్జున చాలా సంతోషంతో చిత్ర యూనిట్ సభ్యులకు ప్రత్యేకంగా ఒక పార్టీని ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా పిలిపించి నాగార్జున అభినందించినట్లు సమాచారం.

  మొత్తానికి నాగచైతన్య అఖిల్ ఇద్దరు కూడా ఒకేసారి సక్సెస్ అందుకోవడంతో అక్కినేని వారి కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. ఇక ఇదే తరహాలో కంటిన్యూ అవ్వాలని నాగార్జున తన కొడుకులకు మరిన్ని సలహాలు ఇస్తున్నట్లు సమాచారం. అఖిల్ తన 5వ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ఏజెంట్ అనే ఆ సినిమాలో అఖిల్ పూర్తిగా సరికొత్త లుక్ తో కనిపించబోతున్నాడు. ఫిట్నెస్ విషయంలోనే కాకుండా హెయిర్ స్టైల్ లో కూడా చాలా మార్పులు తీసుకు వచ్చాడు. ఆ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉంటాయట. మాస్ హీరోగా నిరూపించుకోవడానికి ఏజెంట్ సినిమా అఖిల్ కు చాలా హెల్ప్ అవుతుందని తెలుస్తోంది. మరి ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

  English summary
  Akkineni nagarjuna full happy with akhil MEB succes and planning special party,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X