Akkineni Nagarjuna Net Worth: భారీగా పెరిగిన నాగార్జున ఆస్తులు.. టాలీవుడ్ కింగ్ సంపద ఎన్ని వేల కోట్లంటే?

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు కింగ్ అక్కినేని నాగార్జున. రొమాంటిక్ హీరోగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న ఆయన టాలీవుడ్‌కు దశాబ్ధాలుగా నాలుగు స్తంభాలుగా నిలిచిన నలుగురు అగ్రనటుల్లో ఒకడిగా నిలిచారు. నటుడిగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, స్టూడియో అధినేతగా చిత్ర సీమకు సేవలు అందిస్తున్నారు నాగార్జున. ఆగస్ట్ 29న నాగ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన కీలక విషయాలు చూస్తే..

ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్
1959 ఆగస్ట్ 29న అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ దంపతులకు చెన్నైలో జన్మించారు నాగార్జున. హైదరాబాద్, చెన్నైలలో చదువుకున్న నాగ్.. అనంతరం అమెరికాలోని మిచిగన్‌లో ఉన్న ఈస్ట్రన్ మిచిగన్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. 1984లో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె లక్ష్మీని నాగార్జున పెళ్లాడారు. ఈ దంపతులకు అక్కినేని నాగచైతన్య సంతానం. అయితే మనస్పర్ధలు, ఇతర వ్యక్తిగత కారణాలతో నాగార్జున, లక్ష్మీలు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం తన సహనటి అమలతో ప్రేమలో పడ్డ నాగార్జున.. ఆమెను 1992లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 1994లో అఖిల్ జన్మించారు.

Akkineni Nagarjuna Net Worth here s the Coolie Actor s Net Worth and Assets Details

బాలనటుడిగా ఎంట్రీ
1961లో బాలనటుడిగా తన తండ్రి నటించిన వెలుగు నీడలు, సుడిగుండాలు సినిమాలలో నటించారు నాగార్జున. చదువు పూర్తి చేసిన తర్వాత 1986లో విక్రమ్ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా అడుగుపెట్టారు అక్కినేని నాగార్జున. తొలినాళ్లలో ఆయన నటనపై తీవ్ర విమర్శలు రాగా.. వాటిని అధిగమించి నటుడిగా నిలదొక్కుకున్నారు. ఈ దశలో 1989లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివతో టాలీవుడ్‌ గతిని మార్చేశారు నాగార్జున. భారతీయ సినిమా చరిత్రలో అత్యుత్తమ సినిమాగా శివ నిలిచింది. శివ తర్వాత నాగ్‌కు మాస్ ఇమేజ్ వచ్చింది. ఎప్పుడూ ఒకే తరహా సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్న నాగార్జున.. ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్ సినిమాలు చేస్తూ రొమాంటిక్ హీరో అనిపించుకున్నారు.

అన్నమయ్యలో భక్తుడిగా
ఈ దశలో దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య చిత్రం.. నాగార్జునలోని మరో కోణాన్ని పరిచయం చేసింది. మాస్, రొమాంటిక్ హీరోగా ఉన్న ఆయన ఇలాంటి పాత్ర చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందోనని అంతా భయపడ్డారు. కానీ రాఘవేంద్రరావుపై నమ్మకం ఉంచిన నాగ్.. అలాగే ముందుకెళ్లారు. 1997లో వచ్చిన ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది. రెండు జాతీయ పురస్కారాలు, 9 నంది అవార్డులు, 3 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకుంది అన్నమయ్య. ఈ కోవలోనే శ్రీరామదాసు, శిరిడిసాయి, ఓం నమో వేంకటేశాయ సినిమాలతో భక్తిరసాన్ని పొంగించారు నాగార్జున.

ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్
టాలీవుడ్‌లో ప్రయోగాలు, కొత్తవారిని ప్రొత్సహించే విషయంలో నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. దాదాపు 40 మందికి పైగా కొత్త దర్శకులను, టెక్నీషియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. హీరోగానే కాకుండా బుల్లితెరపై హోస్ట్‌గానూ సక్సెస్ అయ్యారు నాగార్జున. బిగ్‌బాస్, మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షోలకు హోస్ట్‌గా వ్యవహరించారు. కాలానికి తగినట్లుగా మారడమే తన విజయానికి రహస్యమని చెబుతారు నాగార్జున. సూపర్‌స్టార్ అయినప్పటికీ తన ఇమేజ్ పక్కనపెట్టి పలు చిత్రాల్లో గెస్ట్ రోల్స్ చేయడంతో పాటు ఇటీవల రజనీకాంత్ నటించిన కూలీలో విలన్‌గా సరికొత్త అవతారమెత్తారు. ఇప్పటి వరకు 99 సినిమాలు పూర్తి చేసిన నాగార్జున.. తన 100వ సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నారు.

మోస్ట్ సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్‌
సినిమాల్లోనే కాదు వ్యాపారాల్లోనూ నాగార్జున సక్సెస్ అయ్యారు. టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌‌‌ఫుల్ బిజినెస్‌మెన్‌గా నిలిచారు. నాగార్జునను చూసే ఎంతో మంది టాలీవుడ్ సెలబ్రెటీలు వ్యాపారంలోకి దిగారు. ఓ ఛానెల్‌కు భాగస్వామిగా ఉండటంతో పాటు బ్యాడ్మింటన్ లీగ్, ఫుట్‌బాల్ లీగ్‌లలో ఒక్కో జట్టుకు యజమానిగా నిలిచారు. అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు నాగార్జునే చూసుకుటున్నారు. ఇదే కాకుండా అన్నపూర్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్, ఎన్ కన్వెన్షన్ సెంటర్స్, రెస్టారెంట్స్‌ను ఆయన నిర్వహిస్తున్నారు.

సినిమాకు 15 కోట్ల రూపాయల నుంచి 25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌తో పాటు బ్రాండ్ అండార్స్‌మెంట్స్‌తోనూ కోట్లు సంపాదిస్తున్నారు నాగార్జున. ఆయన ఆస్తుల విలువ 3700 కోట్ల పైనే ఉంటుందని అంచనా. అత్యధిక ఆస్తులున్న భారతీయ నటుల టాప్ 10 జాబితాలో నాగార్జున స్థానం సంపాదించారు. 70కి చేరువ అవుతున్నా చెక్కు చెదరని గ్లామర్‌తో దూసుకెళ్తున్న నాగార్జున.. కెరీర్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటోంది ఫిల్మీబీట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X