For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘బంగార్రాజు’ విషయంలో నాగార్జున కీలక నిర్ణయం: చైతూ ఖాళీ అవడం వల్లే ముందుకు

  |

  చాలా కాలంగా హిట్‌ను అందుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున. దాదాపు ఐదేళ్లుగా ఆయనకు ఒక్కటంటే ఒక్క విజయం కూడా దక్కలేదు. అయినప్పటికీ సక్సెస్‌ను వెతుక్కుంటూ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల 'వైల్డ్ డాగ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారాయన. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది. అయితే, కొన్ని ప్రతికూల పరిస్థితుల కారణంగా ఇది కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. దీంతో నాగ్ విజయాల నిరీక్షణకు ముగింపు మాత్రం దక్కలేదు.

  Evaru Meelo Koteeswarulu: చిరంజీవి అభిమానులకు తారక్ కానుక.. గెస్ట్ ఎపిసోడ్, షో ఆరంభ తేదీపై ప్రకటన!

  ఒకదాని తర్వాత ఒకటి ఇలా వరుస పెట్టి నాగార్జున నటించిన ఎన్నో చిత్రాలు పరాజయం పాలవడంతో అక్కినేని అభిమానులు నిరాశగా ఉన్నారు. దీంతో ఈ సారి ఆయన ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం 'సోగ్గాడే చిన్ని నాయన' ప్రీక్వెల్‌గా రూపొందనున్న ఆయన డ్రీమ్ ప్రాజెక్టు 'బంగార్రాజు'పై ఫోకస్ చేశారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టును ఎప్పుడో పట్టాలెక్కించాలని అనుకున్నా.. అనివార్య కారణాల వల్ల అది కాస్తా వీలు పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ చిత్రంపై అక్కినేని నాగార్జున కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

  Akkineni Nagarjunas Bangarraju Shooting Start From August 16th

  'బంగార్రాజు' మూవీని ఆగస్టు నుంచే మొదలు పెట్టబోతున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను వచ్చే సోమవారం అంటే ఆగస్టు 16 నుంచి పట్టాలెక్కిస్తారని తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఇందులోనే దాదాపు సినిమాకు సంబంధించిన యాభై శాతం షూటింగ్ జరగనుందట. మొదటి షెడ్యూల్‌లో భాగంగా కొన్ని ఎమోషనల్ సీన్స్‌ను చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. ఇందులో అక్కినేని నాగ చైతన్య కూడా పాల్గొంటాడని తాజాగా ఓ న్యూస్ లీకైంది.

  వాస్తవానికి 'బంగార్రాజు' మూవీని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29 నుంచి ప్రారంభించాలని అనుకున్నారట. అయితే, నాగా చైతన్య తాజాగా ఆమీర్ ఖాన్ సినిమా 'లాల్ సింగ్ చద్దా' షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాడు. దీంతో ప్రస్తుతానికి అతడు ఖాళీగా ఉన్నాడు. అందుకే ఇప్పుడు 'బంగార్రాజు' షూట్‌ను మొదలు పెట్టి.. ముందుగా చైతూకు సంబంధించిన పార్ట్‌ను చిత్రీకరించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకోసమే ఈ మూవీ షూటింగ్‌ను అనుకున్న సమయానికి కంటే ముందుగానే ప్రారంభించాలని నాగ్ డిసైడ్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

  బాత్‌టబ్‌లో అందాలు ఆరబోసిన అనన్య నాగళ్ల: సర్‌ప్రైజ్ అంటూ మొత్తం చూపించిన తెలుగు పిల్ల

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న 'బంగార్రాజు' మూవీ షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుని జనవరిలో దీన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇందుకు అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్‌ను కూడా అనూప్ రూబెన్స్ పూర్తి చేశాడు. ఇక, ఈ సినిమాలో అక్కినేని నాగార్జునకు జోడీగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తోంది. అలాగే, నాగ చైతన్యతో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి రొమాన్స్ చేయబోతుంది. ఈ మూవీలో బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ కీలక పాత్రను పోషిస్తోంది. వీళ్లతో పాటు చాలా మంది ప్రముఖులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

  English summary
  Tollywood Senior Hero Akkineni Nagarjuna Doing Bangarraju Movie Under Kalyan Krishna Direction. This Movie Shooting Start From August 16th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X