For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఏ హీరో చేయని సాహసం చేస్తున్న నాగార్జున: ఒకేసారి అన్ని రకాలుగా అంటే మాటలా!

  |

  చాలా కాలంగా హిట్ అనే మాట వినక ఇబ్బందులు పడుతున్నాడు కింగ్ అక్కినేని నాగార్జున. ఈ మధ్య కాలంలో ఆయన ఏ సినిమా చేసినా సరైన ఫలితం మాత్రం దక్కడం లేదు. ఇటీవల విడుదలైన 'వైల్డ్ డాగ్' మూవీ ప్రేక్షకుల మెప్పు పొందినప్పటికీ.. కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని ఈ సీనియర్ హీరో పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీనితో పాటు మరికొన్ని చిత్రాలకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది.

  Evaru Meelo Koteeswarulu సెట్స్‌లో తారక్.. మీసం తిప్పిన స్టార్ హీరో.. గెస్ట్ చైర్‌లో ఉన్న ప్రముఖుడు ఎవరంటే!

  విలక్షణ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ప్రవీణ్ సత్తారుతో నాగార్జున ఇటీవలే ఓ సినిమాను ప్రారంభించారు. ఇందులో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన షూట్ కూడా కొంత వరకూ జరిగింది. ఈ నేపథ్యంలో ఇది ఆగిపోయిందని అంటున్నారు. కానీ, ఈ వార్తలపై అక్కినేని కాంపౌండ్ నుంచి కానీ, దర్శకుడి వైపు నుంచి కానీ క్లారిటీ మాత్రం రావడం లేదు. దీంతో వీళ్లిద్దరి సినిమా ఉంటుందా? ఉండదా? అన్నది సస్పెన్స్‌గా మారిపోయిందనే చెప్పాలి.

   Akkineni Nagarjuna to do Three Movies At a Time

  ఆ సినిమాను పక్కన పెడితే.. నాగార్జున త్వరలోనే తన డ్రీమ్ ప్రాజెక్టు 'బంగార్రాజు'ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. గతంలో వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకు ఇది ప్రీక్వెల్‌గా రాబోతుంది. కల్యాణ్ కృష్ణ తెరకెక్కించే ఈ చిత్రంలో అక్కినేని వారసుడు నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు. అతడికి జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ మూవీ ఆగస్టు రెండో వారంలో పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలాగే, దీన్ని సంక్రాంతికి విడుదల చేయాలని నాగార్జున భావిస్తున్నట్లు గతంలోనే వెల్లడించారు.

  కింగ్ అక్కినేని నాగార్జున ఓటీటీ సంస్థ కోసం డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని కొద్ది రోజులుగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఆయన వెబ్ సిరీస్‌లో నటించబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. నాగార్జున ఓటీటీ ఎంట్రీ ఇచ్చేది నిజమేనని తెలిసింది. అంతేకాదు, ఆయన చేసేది వెబ్ సిరీస్ కాదని, సినిమా అని తెలుస్తోంది. సరికొత్త కంటెంట్‌తో ఇది తెరకెక్కబోతుందని అంటున్నారు. ఇప్పటి వరకూ కనిపించని పాత్రలో ఈ సీనియర్ హీరో నటిస్తున్నాడట. ఇది కూడా కొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతుందట.

  అందాలు ఆరబోస్తూ సెగలు రేపుతోన్న బాలయ్య హీరోయిన్: బ్యూటీ దెబ్బకు సోషల్ మీడియా షేక్

  మొత్తానికి అక్కినేని నాగార్జున.. ప్రవీణ్ సత్తారు మూవీని కలుపుకుంటే ఏకంగా మూడు ప్రాజెక్టులను ఏక కాలంలో చేయబోతున్నారని తెలుస్తోంది. ఇవి కాక బిగ్ బాస్ ఐదో సీజన్‌ను కూడా ఒప్పుకుంటే దానికి కూడా సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఒకేసారి ఇన్ని ప్రాజెక్టులు చేస్తున్నారంటే నాగార్జున సాహసానికి జై కొట్టాల్సిందే.

  English summary
  Akkineni Nagarjuna Now Doing An Action Film Under Praveen Sattaru Direction. After This He Plan to do a Bangarraju and anthor Film for Leading OTT Platform.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X