For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Akshay Kumar ను ఢీకొట్టే హీరో ఎవరైనా ఉన్నా? ఆరేళ్లలో తిరుగులేని ట్రాక్ రికార్డ్.. వన్ అండ్ ఓన్లీ హీరోగా!

  |

  బాలీవుడ్‌లో యాక్షన్ హీరోగా కెరీర్ మొదలుపెట్టిన అక్షయ్ కుమార్ ఆ తర్వాత ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే నటుడిగా మారిపోయారు. ఒక సినిమా నుంచి మరో సినిమాకు తన కెరీర్ గ్రాఫ్‌ను రేంజ్‌ను పెంచుకొంటూ పోతున్నారే తప్పా.. ఎక్కడ తగ్గినట్టు కనిపించడం లేదు. భారతీయ సినిమా రంగంలో ఇటీవల కాలంలో ఫ్లాఫ్ లేని హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది వన్ ఓన్లీ అక్షయ్ కుమార్ మాత్రమే అని చెప్పవచ్చు.. మాస్, క్లాస్ ప్రేక్షకులను థియేటర్‌కు రప్పిస్తున్న అక్షయ్ కెరీర్ వివరాల్లోకి వెళితే...

  బాలీవుడ్‌లో చెలరేగిపోతున్న అక్షయ్ కుమార్

  బాలీవుడ్‌లో చెలరేగిపోతున్న అక్షయ్ కుమార్

  గత కొద్ది సంవత్సరాలుగా అక్షయ్ కుమార్ కెరీర్ గ్రాఫ్‌ను పరిశీలిస్తే బాక్సాఫీస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో హిందీ చిత్ర పరిశ్రమలో చెలరేగిపోతున్నారు. యాక్షన్, సోషల్ మెసేజ్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోసి హిట్, ఫీల్ గుడ్ చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు.

  అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫొటోస్.. మరోసారి అదిరిపోయేలా గ్లామర్ ట్రీట్

  2015 ఒక్క ఫ్లాప్ లేకుండా

  2015 ఒక్క ఫ్లాప్ లేకుండా

  అక్షయ్ కుమార్ తన సినిమాలను ప్లాన్ చేసుకొంటున్న విధానం చూస్తే 2015 నుంచి ఆయన ఖాతాలో ఒక్క ఫ్లాప్ కూడా లేకపోవడం గమనార్హం. ఆయన ఖాతాలో ఫ్లాప్‌గా నిలిచిన సినిమా బ్రదర్స్. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా, జాక్వలైన్ ఫెర్నాండేజ్, జాకీ ష్రాఫ్, అశుతోష్ రానా తదితరులు నటించారు. ఆ సినిమా ఆశించినంతగా ఆడకపోవడంతో తన సినిమాల ఎంపికను మార్చుకొన్నాడు. ఆ తర్వాత తాను వెనుకకు తిరిగి చూసుకొన్న దాఖలాలే లేవు.

  గత ఆరేళ్లలో హిట్ చిత్రాలు ఇవే..

  గత ఆరేళ్లలో హిట్ చిత్రాలు ఇవే..

  2015 తర్వాత ఆయన నటించిన ప్రతీ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. గత ఆరు సంవత్సరాల్లో ఏ చిత్రం కూడా బయ్యర్లను, డిస్టిబ్యూటర్లను, నిర్మాతలను నిరాశపరచలేదు. ఆయన నటించిన చిత్రాలు ఎయిర్‌లిఫ్ట్, జాలీ ఎల్ఎల్‌బీ 2, గోల్డ్, మిషన్ మంగళ్, గుడ్ న్యూస్, హౌస్‌ఫుల్ 4 లాంటి సినిమాలు బాక్సాఫీ వద్ద తడాఖాను చూపించాయి. దాంతో బాలీవుడ్‌లో గ్యారంటీ హీరో ఎవరైనా ఉన్నారంటే అక్షయ్ కుమార్ గుర్తొస్తారు.

  టాప్ తీసేసి షాకిచ్చిన పూనమ్ బజ్వా: అందాల ఆరబోతలో గేట్లు ఎత్తేస్తూ.. ఓ రేంజ్‌లో చూపించిన హీరోయిన్

  150వ సినిమా కోసం సిద్దమవుతున్న అక్షయ్ కుమార్

  150వ సినిమా కోసం సిద్దమవుతున్న అక్షయ్ కుమార్

  ఇక సినిమాల ఎంపిక కూడా పక్కా ప్లాన్‌గా ఉంటుంది. ఏడాదిలో రెండు, మూడు సినిమాలను ఈజీగా చేస్తేస్తూ చురుకుగా కనిపిస్తాడు. తన ఫిట్‌నెస్‌లోను, హిట్ విషయంలోను తేడా రాకుండా చూసుకొంటారు. 1987లో కెరీర్ ప్రారంభించిన అక్షయ్ కుమార్ ఇప్పటి వరకు తన కెరీర్‌లో 146 సినిమాలు పూర్తి చేశారు. త్వరలోనే 150 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

  ఆగస్టు 19న బెల్ బాటమ్ మూవీ

  ఆగస్టు 19న బెల్ బాటమ్ మూవీ

  ప్రస్తుతం అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ, బెల్‌బాటమ్ సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. బెల్ బాటమ్ చిత్రం ఆగస్టు 19వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్నది. ఈ చిత్రంలో లారా దత్తా, వాణి కపూర్, హ్యుమా ఖురేషీ హీరోయిన్లుగా నటించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించిన లారా దత్తా లుక్ వైరల్‌గా మారింది.

  తల్లైనా తగ్గని కరీనా కపూర్: గ్లామర్ ట్రీట్‌తో సెగలు రేపుతోన్న సీనియర్ హీరోయిన్

  #RIPDilipKumar: Bollywood Legend ట్రాజెడీ కింగ్.. అత్యధిక అవార్డులు గెలుచుని గిన్నిస్ రికార్డు
  2022లో రిలీజ్ కానున్న సినిమాలు...

  2022లో రిలీజ్ కానున్న సినిమాలు...

  ఇక అక్షయ్ కుమార్ కమిట్ అయిన ప్రస్తుత సినిమాలు చూస్తే.. బచ్చన్ పాండే, పృథ్వీరాజ్, అత్రంగీ రే, రామ్ సేతు, రక్షా బంధన్, మిషన్ సిండ్రెల్లా: పార్ట్ 1 చిత్రాలు ఉన్నాయి. బాలీవుడ్‌లో గానీ, ఇతర సినిమా రంగాల్లో ఏ హీరో చేతిలో లేని విధంగా అరడజన్ చిత్రాలు ఉండటం, రెండు సినిమాలు రిలీజ్ సిద్ధంగా ఉండటం అక్షయ్ కుమార్‌కే ఆ క్రెడిట్ దక్కింది.

  English summary
  Akshay Kumar is getting ready with Bell Bottom, Sooryavanshi. He is setting his goals with 150th movie. No flop in last six years since 2015.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X