For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మాట తప్పి మడమ తిప్పిన Akshay Kumar.. కర్రు కాల్చి వాతపెట్టిన నెటిజన్లు.. దెబ్బకు క్షమాపణతో లేఖ

  |

  సోషల్ మీడియా బలంగా మారిన సమయంలో సినీ తారలు గానీ, రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు మాట్లాడే ముందు ఒకటి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే.. వారు మాట తప్పి..మడమ తప్పితే.. కర్రు కాల్చి వాతపెట్టడానికి నెటిజన్లు ఎప్పుడు సిద్దంగానే ఉంటారు. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ పరిస్థితికి చేదు అనుభవం ఎదురైంది. దాంతో బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకు ట్విట్టర్‌లో అక్షయ్ కుమార్ క్షమాపణలు చెప్పడానికి కారణం ఏమిటంటే..

  గుట్కా యాడ్స్‌లో నటించమని అంటే..

  గుట్కా యాడ్స్‌లో నటించమని అంటే..

  గతంలో ఓ సినిమా ప్రమోషన్‌లో అక్షయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తాను పొగాకు, మద్యం లాంటి వ్యాపార ప్రకటనల్లో నటించడానికి వ్యతిరేకం అంటూ స్పీచ్ ఇచ్చాడు. నాకు భారీ కంపెనీల నుంచి భారీ ఆఫర్లు వస్తాయి. గుట్కా కంపెనీలు యాడ్స్‌లో నటించమని బలవంతం పెడుతుంటారు. నీవు ఎంత అంటే అంత రెమ్యునరేషన్ చెల్లించడానికి సిద్దమని అంటారు. కానీ డబ్బు విషయం కాదు. మనమంత స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగమయ్యాం. అందుకే మనం అలాంటి ఆఫర్లను నేను ఒప్పుకోను అంటూ అక్షయ్ కుమార్ చెప్పాడు.

  షారుక్ ఖాన్‌, అజయ్ దేవగణ్‌తో కలిసి

  షారుక్ ఖాన్‌, అజయ్ దేవగణ్‌తో కలిసి

  అక్షయ్ కుమార్ తాను చెప్పిన మాటలు మరిచిపోయాడో ఏమో కానీ.. అజయ్ దేవగణ్, షారుక్ ఖాన్‌తో కలిసి అక్షయ్ కుమార్ విమల్ ఇలాచీ అనే గుట్కా కంపెనీ యాడ్‌లో నటించాడు. ఇందుకు భారీగా రెమ్యునరేషన్ అందుకొన్నట్టు మీడియాలో సమాచారం. అయితే ఈ యాడ్‌లో నటించిన తర్వాత అక్షయ్ కుమార్ నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

  బాయ్‌కాట్ బాలీవుడ్ అంటూ అక్షయ్‌పై నిప్పులు

  అక్షయ్ కుమార్ పొగాకు, మద్యం వ్యాపార ప్రకటనలలో నటించనంటూ చెప్పి.. మాట మార్చినందుకు #BoycottBollywood అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. ఇలాంటి మాయ మాటలు చెప్పి అభిమానులను, ప్రేక్షకులను మోసం చేస్తున్నారు అంటూ అగ్ర హీరోలను నెటిజన్లు ట్విట్టర్‌లో ఎటాక్ చేశారు. గత రెండు రోజులుగా బాలీవుడ్ హీరోల తీరుతెన్నులు, ప్రవర్తనపై సోషల్ మీడియాలో భారీగా చర్చ జరగడంతో అక్షయ్ కుమార్ ఎమోషనల్‌గా స్పందించాడు.

  ఇక అలాంటి ప్రకటనల్లో నటించను

  ఇక అలాంటి ప్రకటనల్లో నటించను

  పొగాకు ప్రోడక్ట్ ప్రకటనల్లో నటించడంపై రియాక్ట్ అవుతూ అక్షయ్ కుమార్ ట్వీట్టర్‌లో లేఖ పోస్టు చేశారు. నా ఫ్యాన్స్, శ్రేయోభిలాషుల మనోభావాలను గాయపరిచినందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను. సోషల్ మీడియాలో మీ రియాక్షన్లు నన్ను తీవ్రంగా కదలించాయి. ఇక ముందు నేను పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్లో నటించను. విమల్ ఇలాచీ వ్యాపార ప్రకటనలో నటించడం వల్ల మీరు ఎంత బాధపడ్డారో అర్ధం చేసుకోగలను. మీ మనోభావాలను గౌరవిస్తాను అని అక్షయ్ కుమార్ చెప్పారు.

  ఆ పారితోషికాన్ని సమాజసేవకు ఉపయోగిస్తా

  మీరు అనుభవించిన బాధకు ఉపశమనం కలిగిస్తానను. విమల్ ఇలాచీ ప్రకటనల్లో నటించినందుకు తీసుకొన్న పారితోషికాన్ని ఓ మంచి సామాజిక కార్యక్రమానికి ఉపయోగిస్తాను. లీగల్‌గా ఒప్పందం చేసుకొన్నందున్న మరికొన్నాళ్లు ఆ వ్యాపార ప్రకటన కొనసాగుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు మన్నించాలి. ఇక ముందు వ్యాపార ప్రకటనల్లో నటించే ముందు ఇలాంటివి రాకుండా చూసుకొంటాను. మీ నుంచి ఎప్పుడూ ప్రేమ, అనురాగాలను ఆశిస్తూనే ఉంటాను అని అక్షయ్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు.

  అక్షయ్ కుమార్ సినీ కెరీర్ ఇలా..

  అక్షయ్ కుమార్ సినీ కెరీర్ ఇలా..

  అక్షయ్ కుమార్ కెరీర్ విషయానికి వస్తే.. గతేడాది సూర్యవంశీ, అత్రంగీ రే చిత్రాల్లో నటించాడు. ఇటీవల ఆయన నటించిన బచ్చన్ పాండే చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేదు. త్వరలోనే ఫృథ్వీరాజ్, రక్షాబంధన్, రామ్ సేతు, మిషన్ సిండ్రెల్లా, ఓ మై గాడ్ 2, సెల్ఫీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇంకా పలు ప్రాజెక్టుల చర్చల దశలో ఉన్నాయి.

  English summary
  Bollywood actor Akshay Kumar tendered apology to fan over Vimal Elaichi advertisement. He tweeted that I would like to apologise to you, While I have not and will not endorse tobacco.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X