Just In
- 3 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 4 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 5 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 6 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అల్లు అర్జున్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం.. ఈ ఘనత సాధించిన ఏకైక తెలుగు హీరోగా రికార్డ్.!
అల్లు అర్జున్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో ఒకడు. మిగిలిన హీరోలతో పోల్చుకుంటే ఇతడే తెలుగు ప్రేక్షకులకు సరికొత్త స్టైల్స్‌ను పరిచయం చేశాడు. అందుకే బన్నీని స్టైలిష్ స్టార్ అంటారు. దీనికి తోడు యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌లో రాణిస్తూ దూసుకుపోతున్నాడు. కెరీర్‌లో ఎత్తు పల్లాలను చూసిన ఈ స్టార్ హీరో.. ఫ్యాన్స్ కోసం ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని పరాజయాలను చూశాడు. తాజాగా అల్లు అర్జున్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి తెలుగు హీరోగా నిలిచాడు. ఇంతకీ ఏంటా రికార్డు.? వివరాల్లోకి వెళితే...

హ్యాట్రిక్ కోసం ఆయనతో కలిశాడు
అల్లు అర్జున్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల.. వైకుంఠపురములో' అనే సినిమా చేస్తున్నాడు. ‘జులాయి', ‘సన్నాఫ్ సత్యమూర్తి' వంటి హిట్‌ల తర్వాత వస్తున్న ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని వీరిద్దరూ భావిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. టబు, నవదీప్, సుశాంత్, నివేదా పేతురాజ్, సముద్రఖని, మురళీ శర్మ కీలక పాత్రలు చేస్తున్నారు.

ఆయన మార్క్ కనిపించింది
‘అల.. వైకుంఠపురములో' సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ చూసిన వారికి ఇది అర్థం అవుతుంది. అలాగే, ఇందులో త్రివిక్రమ్ మార్క్ డైలాగులు కూడా కనిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదల కాబోతుందీ సినిమా.

ఇప్పటికే ఎన్నో రికార్డులు కొట్టారు
ఈ సినిమాకు సంబంధించిన అన్ని అప్‌డేట్స్‌కు తెలుగు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, గ్లింప్స్, పాటలు సత్తా చాటాయి. ముఖ్యంగా ఇందులోని రెండు పాటలు ‘సామజవరగమన', ‘రాములో రాములా' అత్యధిక వ్యూస్, లైక్స్ సాధించిన పాటలుగా దక్షిణ భారతదేశ రికార్డులను క్రియేట్ చేశాయి. దీంతో ఈ మూవీ అంచనాలు పెరిగిపోయాయి.

అక్కడ కూడా.. ఆ పేరుతో వస్తోంది
‘అల.. వైకుంఠపురములో' సినిమాను మలయాళంలోనూ విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన అల్లు అర్జున్ సినిమాలకు కేరళలో మంచి వసూళ్లు వచ్చిన నేపథ్యంలో చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ‘అంగు.. వైకుంతపురతు' అనే టైటిల్‌తో మలయాళంలోనూ తెరకెక్కించారు. ఇప్పటికే టీజర్, పాటలు, ట్రైలర్‌ను సైతం ఆ భాషలో విడుదల చేశారు.

అల్లు అర్జున్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం
మలయాళంలో అల్లు అర్జున్‌కు ఎంత క్రేజ్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా తెరపైకి వచ్చిన ఓ న్యూస్‌తో దానికి బలం చేకూరింది. ‘అల' మలయాళ వెర్షన్ కూడా జనవరి 12న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో కేరళలో 30 థియేటర్లలో ఆరోజు బెన్‌ఫిట్ షోలు వేయబోతున్నారు. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో సినిమాకూ ఈ ఘనత దక్కకపోవడం గమనార్హం.