For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Allu Arjun: హీరోగా అదొక లక్షణం, తన పేరును నా పేరులో పెట్టుకోవచ్చు.. అల్లు అర్జున్ కామెంట్స్

  |

  యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, మలాయళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కలసి జంటగా నటించిన కార్తికేయ 2 మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తొలిసారిగా జత కట్టిన ఈ పెయిర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే శ్రీకృష్ణుడి నేపథ్యంతో తెరకెక్కిన కార్తికేయ 2 సినిమా దేశవ్యాప్తంగా హిట్ కావడంతో నిఖిల్ అండ్ అనుపమకు ఎక్కువ పాపులారిటీ లభించింది. ఇప్పుడు మరోసారి 18 పేజీస్ సినిమాతో జత కట్టారు నిఖిల్, అనుపమ పరమేశ్వరన్. డిసెంబర్ 23న ప్రేక్షకులు ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  ఆసక్తికర విషయాలు..

  ఆసక్తికర విషయాలు..

  నిఖిల్ సిద్ధార్థ్, బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్ మరోసారి జంటగా నటించిన మూవీ 18 పేజీస్. కరెంట్, కుమారు 21F వంటి సినిమాలన డైరెక్ట్ చేసిన పల్నాటి సూర్యప్రతాప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా గ్రాండ్ గా డిసెంబర్ 23న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

  ఆయన ముఖ్యమైన వ్యక్తి..

  ఆయన ముఖ్యమైన వ్యక్తి..

  "18 పేజీస్ సినిమాను నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తులు కలిసి చేస్తున్నారు. అందులో నా డైరెక్టర్, నా ఫ్రెండ్, నా శ్రేయోభిలాషి, ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన సుకుమార్. ఆయన నా హృదయానికి ఎంతో దగ్గరైనవారు. సుకుమార్ లేకపోతే నా జర్నీ ఇలా అస్సలు ఉండేది కాదు అని ఎప్పుడు అనుకుంటాను. ఈరోజు నేను ఇక్కడ ఇలా ఉండటంలో ఆయన ముఖ్యమైన వ్యక్తి. అందుకు ఆయనపై ఎప్పుడు ప్రేమ, గౌరవం, కృతజ్ఞతభావం అన్నీ ఉంటాయి. థ్యాంక్యూ సోమచ్ డార్లింగ్. తనను అంత లవ్ చేస్తాను కాబట్టే.. తను నా సినిమా ఎంత లేట్ చేసినా అడగలేను" అని బన్నీ తెలిపాడు.

  తన పేరులో నేను..

  తన పేరులో నేను..

  "నాకు దగ్గరైన మరో వ్యక్తి వాసు. వాసును నా ఫ్రెండ్ అనాలా.. బ్రదర్ అనాలా.. గైడ్ అనాలా.. నన్ను రక్షించేవాడు అనాలా తెలియదు. తనకు నేను అంటే ఎంత ఇష్టమంటే తన పేరులోనే నా పేరు బన్ని అని ఉంది. తనని అందరూ బన్నీ వాస్ అంటుంటారు. నా పేరులో వాసు లేదు కానీ.. నా పేరులో వాసు అని పెట్టుకునేంత క్లోజ్ నాకు. వీరిద్దరు కలిసి సినిమా చేస్తుంటే నేను తప్పితే ఈ వేడుకకు ఎవరు వస్తారు" అని అల్లు అర్జున్ పేర్కొన్నాడు.

  సినిమా అంటే ప్రేమ ఉన్న నిర్మాత..

  సినిమా అంటే ప్రేమ ఉన్న నిర్మాత..

  "మా నాన్న అల్లు అరవింద్ గారికి థ్యాంక్స్. సినిమాను ఓటీటీలో విడుదల చేయమని ఆయనకు చాలా ఆఫర్సు వస్తున్నాయి. నాకు ఓటీటీ ఛానెల్ ఉన్నా.. నేను థియేటర్స్ కే సపోర్ట్ చేస్తాను. సినిమాను థియేటర్లలో చూడాలనే జనాల ఉత్సాహం పోకూడదనే సంస్కృతికి ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఆయన నా తండ్రే కాదు. సినిమా అంటే ప్రేమ ఉన్న నిర్మాత. అందుకే ఆయనంటే నాకు చాలా గౌరవం. 18 పేజీస్ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, ముఖ్యంగా సంగీత దర్శకుడు గోపీ సుందర్ గారికి అభినందనలు. ఆయనతో కలిసి త్వరలోనే సినిమా చేస్తానని అనుకుంటున్నాను" అని బన్నీ వెల్లడించాడు.

  మంచి సినిమా ఇవ్వాలని..

  మంచి సినిమా ఇవ్వాలని..

  "డైరెక్టర్ సూర్య ప్రతాప్ ను నేను ఆర్య సినిమా నుంచి చూస్తున్నాను. తను ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. డైరెక్టర్ గా కుమారి 21F సినిమా చేశారు. సినిమా సక్సెస్ తర్వాత వెంటనే రెండో చిత్రం చేసేద్దామనే తొందరలో ఉంటారు. కానీ ఆయన అలా కాదు.. నాలుగేళ్లు ఎదురుచూశారు. ఇస్తే మంచి సినిమా ఇవ్వాలని 18 పేజీస్ సినిమా చేస్తున్నారు. ఆయనకు ఆల్ ది బెస్ట్. అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ కు ఆల్ ది బెస్ట్. మంచి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటూ గ్రాఫ్ పెంచుకుంటూ వెళుతున్నాడు. తను గొప్ప పుస్తక అభిమాను. తన లైబ్రరీలో చాలా పుస్తకాలుంటాయి. ఆ యాక్టర్ కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే బాగా చదవగలగాలి. తనకు ఆ లక్షణం ఉంది" అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.

  ఓ రోడ్ వేశారు...

  ఓ రోడ్ వేశారు...

  "ఒకప్పుడు మన సౌత్ లో సినిమాలు చేస్తే మన వరకు మాత్రమే ఉండేది. కానీ రాజమౌళి గారు దాన్ని మార్చారు. ఓ రోడ్ వేశారు. బాహుబలి తర్వాత ఎన్నో సినిమాలు సౌత్ నుంచి నార్త్ కు వెళ్లటం మొదలైంది. పుష్ప, కేజీఎఫ్, కాంతారా సినిమాలు నార్త్ కు వెళ్లాయి. అలాగే కార్తికేయ 2 కూడా వెళ్లింది. మన సినిమాలను అందరూ చూడాలి. అది మనం గర్వించే క్షణాలు. దేశమంతా మన సినిమాలను ఆసక్తిగా చూస్తొంది" అని అల్లు అర్జున్ పేర్కొన్నాడు.

  English summary
  Icon Star Allu Arjun Speech About Sukumar Bunny Vasu Nikhil And Allu Aravind In 18 Pages Movie Pre Release Event
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X