For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాన్నతో గొడవా? రహస్యం చెప్పలేను, అతడు ఫ్యాన్ అని తెలిసి ఆశ్చర్యపోయా: అల్లు అర్జున్

|

టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్‌‌కు భారీగా అభిమానులు ఏర్పడటానికి కారణం... స్టైల్ విషయంలో, డాన్స్ విషయంలో తనదైన ప్రత్యేకత చూపించడమే. అందుకే అతడు 'స్టైలిష్ స్టార్'గా పాపులర్ అయ్యారు. బన్నీకి కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాదు... బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన సినిమాలు హిందీ డిజిటల్ ప్లాట్‌ఫాంలో డబ్ అయి సంచలనాలు నమోదు చేసిన సందర్భాలు అనేకం. బన్నీని అభిమానించే వారిలో బాలీవుడ్ నటులు కూడా ఉన్నారు. 'గల్లీబాయ్' మూవీ ద్వారా పాపులర్ అయిన సిద్ధాంత్ చతుర్వేది ఇటీవల హైదరాబాద్ వచ్చినపుడు తెలుగులో తను ఇష్టమైన స్టార్ అల్లు అర్జున్ అని, ఆయన్నుకలవాలనే కోరికను వెలుబుచ్చారు.

బన్నీ వరకు వెళ్లిన సిద్ధాంత్ మ్యాటర్

బన్నీ వరకు వెళ్లిన సిద్ధాంత్ మ్యాటర్

అభిమానులంటే బన్నీ చాలా రెస్పెక్ట్ ఇస్తారు. వారి విష్ ఫుల్‌ఫిల్ చేయడంలో ముందుంటారు. ‘గల్లీ బాయ్' నటుడు సిద్ధాంత్ చదుర్వేది కూడా తనను అభిమానించే వారిలో ఒకరు అని తెలిసి ఆశ్చర్యపోయారట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బన్నీ... సిద్ధాంత్ అంశంపై స్పందించారు.

అతడి నటన చాలా నచ్చింది, త్వరలో కలుస్తా

అతడి నటన చాలా నచ్చింది, త్వరలో కలుస్తా

‘‘గల్లీ బాయ్ యాక్టర్ సిద్ధాంత్ నా అభిమాని అని తెలిసి ఆశ్చర్యపోయాను. ఇటీవల ఆ మూవీ కూడా చూశాను. అందులో సిద్దాంత్ నటన ఎంతో నచ్చింది. మొదటి మూవీతోనే ప్రేక్షకులను తన స్టైల్‌తో మెస్మరైజ్ చేశాడు. ఇలాంటి వారిని నేనెప్పుడూ చూడలేదు. అతడికి సినిమా రంగంలో మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నాను. వీలు చూసుకుని సిద్ధాంత్‌ను కలుస్తాను'' అన్నారు.

ఇప్పుడే రహస్యాలన్నీ బటయ పెట్టలేను

ఇప్పుడే రహస్యాలన్నీ బటయ పెట్టలేను

త్రివిక్రమ్‌తో చేస్తున్న సినిమా గురించి వివరాలు పంచుకోవడానికి బన్నీ ఇష్టపడలేదు. ఇప్పుడే నేను రహస్యాలన్నీ బయట పెడితే కిక్ ఉండదు. ఈ చిత్రం వినోదాత్మకంగా ఉంటుందని మాత్రమే చెప్పగలను. ఇటీవలే షూటింగ్ మొదలైంది అన్నారు. సినిమాకు సంబంధించిన ఒక్కో విషయం... క్రమ క్రమంగా బయటకు వస్తూ సర్‌ప్రైజ్ చేస్తాయని బన్నీ చెప్పుకొచ్చారు.

టబు విషయంలో ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేను

టబు విషయంలో ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేను

ఈ చిత్రంలో టబు నటిస్తోందనే వార్తలపై అల్లు అర్జున్ స్పందిస్తూ... ‘ఇంకా ఏది ఫైనలైజ్ అవ్వలేదు. అందుకే ఈ విషయంలో క్లారిటీ ఇవ్వలేను. టబు మంచి యాక్టర్, ఆమె నటన అంటే నాకు ఇష్టమే. త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి' అని అల్లు అర్జున్ స్పష్టం చేశారు.

మా నాన్నతో నాకు గొడవలా..

మా నాన్నతో నాకు గొడవలా..


అల్లు అర్జున్ తన తండ్రి అరవింద్‌తో గొడవ పడ్డట్లు ఇటీవల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై కూడా స్టైలిష్ స్టార్ స్పందించారు. నేను, నాన్న ఒకే ఇంట్లో ఉంటాం. చాలా విషయాలు చర్చించుకుంటాం. అయినా మా మధ్య గొడవలు ఎందుకు వస్తాయి. ఇలాంటి వార్తలు విన్నపుడు చాలా ఫన్నీగా అనిపిస్తుందన్నారు.

కేవలం వారసత్వం సరిపోదు

కేవలం వారసత్వం సరిపోదు

అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. నిర్మాతగా తండ్రి అండ ఉంది. అయితే ఎన్ని ఉన్నప్పటికీ సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే చివరగా కావాల్సింది టాలెంటే అని, మన బ్యాగ్రౌండ్ మనల్ని కొంత వరకు మాత్రమే ముందుకు నెడతాయి. అంతకు మించి పైకి రావాలంటే టాలెంటే ముఖ్యమని బన్నీ తెలిపారు.

English summary
"It was a pleasant surprise when Siddhant Chaturvedi said that because I liked his work in ‘Gully Boy’ a lot. Of late, I haven’t seen anybody who has so much swag and who has done such a wonderful job in their first film. From the bottom of my heart, I wish him all the best for his future endeavours and I hope to meet him someday." Allu Arjun told to gulfnews.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more