సుకుమార్ శిష్యుడిని కూడా లైన్ లో పెట్టిన అల్లు అర్జున్..?

కరోనా ప్రభావం తగ్గితే మన హీరోలు బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయడం కాయంగా కనిపిస్తోంది. ఒక సినిమా తరువాత మరొక సినిమాను గ్యాప్ లేకుండా విడుదల చేస్తారని చెప్పవచ్చు. ఇక షూటింగ్స్ మొదలు పెట్టారు అంటే మరో రెండేళ్ల వరకు రెస్ట్ దొరకదేమో అనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఒక సినిమా సెట్స్ పై ఉండగానే రెండు మూడు సినిమాలను లైన్ లో పెడుతున్నారు.

నెక్స్ట్ ఎవరు అందుబాటులో ఉంటే వారితో సినిమా చేయాలని హీరోలతో పాటు మరో వైపు దర్శకులు అదే ఆలోచిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా అదే ప్లాన్ తో ఉన్నాడు. అసలైతే బన్నీ పుష్ప అనంతరం కొరటాల శివతో సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ అనుకోకుండా ఎన్టీఆర్ తొందర పెట్టడం వలన కొరటక శివ మనసు మార్చుకోవడంతో ఆ సినిమా కాస్త వాయిదా పడింది. సినిమా అయితే క్యాన్సిల్ అవ్వలేదు. కానీ పుష్ప అనంతరం ఉంటుందా లేదా అన్నది డౌటే.

Allu arjun discussion one new story with Sukumar student

ఇక కొరటాలతో పాటి వేణు శ్రీరామ్ తో ఐకాన్ అనే సినిమాను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనే విషయంలో ఎవరు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఇక ఆ దర్శకులతో పాటు అల్లు అర్జున్ ముందుగానే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబును కూడా లైన్ లో పెడుతున్నట్లు సమాచారం. ఉప్పెన సినిమాతో హిట్టు కొట్టిన బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం కూడా కథ సెట్ చేస్తున్నాడు. కానీ ఆ కథకు తారక్ ఇంకా అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు. ఆ కాంబో సెట్టవ్వడం అనుమానామే అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఒక వేళ సెట్టవ్వకపోతే ఆ కథ బన్నీ చేతుల్లోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఎదురుచూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X