For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పుష్ప కోసం అల్లు అర్జున్ కష్టాలు.. మేకప్ కోసం మూడు గంటలు.. ఎందుకంటే?

  |

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలలో పుష్ప కూడా టాప్ లిస్టులో ఉందని చెప్పవచ్చు. ఈ సినిమాపై కూడా ఇటీవల అంచనాలు భారీగానే పెరిగాయి. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఒకేసారి ఐదు భాషల్లో ఐదు మంది డిఫరెంట్ సింగర్స్ తో విడుదల చేయించిన మొదటి పాట అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకుంది. ఇంతకు ముందే ఫస్ట్ లుక్ టీజర్ తో భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసిన పుష్ప రాజ్ ఇప్పుడు పాటతో కూడా అంతకుమించి అనేలా అంచనాలను క్రియేట్ చేస్తున్నాడు. చూస్తుంటే సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం పక్కా అని అభిమానుల్లో అయితే ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది.

  ఎందుకంటే అల్లు అర్జున్ ఈ సినిమాలో నెవర్ బిఫోర్ అనేలా హై వోల్టేజ్ క్యారెక్టర్ తో కనిపిస్తున్నాడు. దర్శకుడు సుకుమార్ కూడా గతంలో మాదిరిగా కాకుండా మొదటి సారి ఫుల్ లెంత్ యాక్షన్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలని అల్లు అర్జున్ పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. ఓ వైపు సినిమా ప్రమోషన్స్ పై కూడా తనదైన శైలిలో సలహాలు ఇస్తున్నారట. సినిమా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ కు కూడా ఇదే తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక ఈ సినిమా కోసం బన్నీ పడుతున్న కష్టంపై రోజుకొక న్యూస్ వైరల్ అవుతోంది.

  Allu arjun hard working in pushpa shooting for special makeup,

  గతంలో అల్లు అర్జున్ స్టైలిష్ అండ్ క్లాస్ పాత్రల్లో చాలా బాగా నటించాడు. అవన్నిటికి భిన్నంగా ఈసారి మాత్రం ఒక ఊర మోస డస్కీ లుక్కుతో చాలా రఫ్ గా కనిపిస్తున్నాడు. విభిన్నమైన ఫేస్ లుక్స్ లో హెయిర్ స్టైల్ ని కూడా పూర్తిగా మార్చేశాడు. ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు కూడా మంచి బజ్ అయితే క్రియేట్ అయ్యింది. అయితే సినిమాలో మేకప్ కోసం అల్లు అర్జున్ 3 గంటల పాటు కష్టపడాల్సి వస్తోందట. మేకప్ వేసుకోవడానికి రెండు గంటలకు పైగా సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాడట. ఇక ఆ మేకప్ ను తొలగించుకోవడానికి కూడా మరొక గంట సేపు కష్ట పడాల్సి వస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

  Cheruvaina Dooramaina Movie Public Talk మర్డర్ మిస్టరీతో ప్రేమ కథా చిత్రంగా!!

  ఈ సినిమా కోసం బన్నీ ప్రాణం పెట్టి నటిస్తున్నట్లు అర్థమవుతోంది. సినిమాలో ప్రతి ఎపిసోడ్ కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందట. దాదాపు పది కేజిఎఫ్ సినిమాలతో సమానం అని గతంలో బుచ్చి బాబు వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. సుకుమార్ కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు మరి సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక పుష్ప 1 సినిమాను ఈ ఏడాది డిసెంబర్ నెలలో క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. అలాగే సినిమా విడుదల అనంతరం అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమాతో బిజీ కానున్నాడు.

  English summary
  Allu arjun hard working in pushpa shooting for special makeup,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X