వకీల్ సాబ్ ఎఫెక్ట్.. ఐకాన్ విషయంలో మరోసారి ప్లాన్ చేంజ్ చేస్తున్న బన్నీ!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల ఆలోచనలు మామూలుగా ఉండడం లేదు. ఒకరిని మించి మరొకరి హై లెవెల్లోనే ఆలోచిస్తున్నారు. ఒక సినిమా హిట్టయ్యింది అంటే ఆ తరువాత వచ్చే సినిమా అంతకు మించి అనేలా ఉండాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా ప్రేక్షకులు అంచనాలను సైతం చాలా కష్టపడి అందుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్ ఐకాన్ విషయంలో మరోసారి ప్లాన్ చేంజ్ చేసినట్లు తెలుస్తోంది.
సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విదంగా ఊర మాస్ యాక్షన్ ను చూపించబోతున్నారట. ఈ సినిమాపై అందరూ చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. రెండు బాగాలుగా రాబోతోందని అన్నప్పటి నుంచి కూడా అంచనాల డోస్ అమాంతంగా పెరిగిపోయాయి. అయితే అలాంటి సినిమా అనంతరం వచ్చే మూవీ కూడా అంతకుమించి అనేలా ఉండాలని అభిమానులు కూడా కోరుకుంటారు.

పుష్ప ఫస్ట్ పార్ట్ అనంతరం ఐకాన్ ను సెట్స్ పైకి తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. మొదట ఈ సినిమాను తెలుగులోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ దర్శకుడు వేణు శ్రీరామ్ ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకోవడం వలన అల్లు అర్జున్ కు అతని మీద మరింత నమ్మకం వచ్చిందట.
అందుకే ఐకాన్ ను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ముందు నుంచే బన్నీకి ఆ ఆలోచన ఉందట. కానీ వేణు శ్రీరామ్ ఆ రేంజ్ లో స్క్రిప్ట్ ను మళ్ళీ రెడీ చేయగలడా లేదా అనే విషయంలో కాస్త కన్ఫ్యూజ్ అయ్యాడట. ఇక మొత్తానికి ఇప్పుడు నమ్మినట్లు తెలుస్తోంది. మరి వేణు శ్రీరామ్ ఆ అంచనాలను ఎంతవరకు అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











