మరో రోల్‌లో కనిపించనున్న అల్లు అర్జున్: తండ్రి, అన్నను కాదని కొత్తగా ప్లానింగ్

యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో ఒకడిగా వెలుగొందుతున్నాడు అల్లు అర్జున్. బడా ఫ్యామిలీకి చెందిన హీరోనే అయినా.. తనలోని టాలెంట్‌ను నిరూపించుకుని సక్సెస్ అయ్యాడు. దీంతో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అల్లు వారి అబ్బాయి.. నిర్మాతగా సరికొత్త అవతారం ఎత్తబోతున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా దానికి సంబంధించిన ఓ అప్‌డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

అల్లు అర్జున్ తండ్రి అరవింద్‌కు గీతా ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థ ఉన్న విషయం తెలిసిందే. సోదరుడు అల్లు బాబీ కూడా ఇటీవలే నిర్మాతగా ఎంట్రీ ఇచ్చాడు. వీళ్లిద్దరూ ప్రొడ్యూసర్లుగా ఉన్నా సరే బన్నీ కూడా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టాలెంట్ ఉండి అవకాశాలు దొరకని ఎంతో మందిని చిత్ర సీమకు పరిచయం చేసేందుకే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. ఈ మేరకు త్వరలోనే ఓ ప్రకటన చేయనున్నాడని అంటున్నారు. అంతేకాదు, బన్నీ తీసే సినిమాలన్నీ ఆహా వీడియోలోనే విడుదల అవుతాయని తెలిసింది.

Allu Arjun plans Start a Film Production for Aha Video

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌తో ఐదు భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటిస్తుండగా, మరికొందరు ప్రముఖులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే, ఈ సినిమాలో బన్నీ గంథపు చెక్కల స్మగ్లర్‌గా కనిపించనున్నాడు. అందుకోసం ఈ సినిమా షూటింగ్‌ను తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుపుతున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్పాట్‌కు సంబంధించిన లుక్ కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X