Just In
- just now
మళ్లీ ఊపేసిన సాయి పల్లవి.. ‘సారంగదరియా’ వైరల్
- 38 min ago
Naandhi Collections.. దుమ్ములేపిన అల్లరి నరేష్.. ఇప్పటి వరకు వచ్చిన లాభమెంతంటే?
- 59 min ago
తల్లి కాబోతోన్న ప్రభాస్ హీరోయిన్.. మొత్తానికి అలా గుడ్ న్యూస్ గుట్టు విప్పేసింది!
- 2 hrs ago
నా ఫస్ట్ లవ్ నా హార్ట్ బ్రేక్.. అన్ని విషయాలు ఒకరికే తెలుసు.. గుట్టువిప్పిన సమంత
Don't Miss!
- Sports
India vs England: మొతెరా పిచ్‌ను నాగలితో దున్నుతున్నారు.. క్యురేటర్‌పై మైకేల్ వాన్ సెటైర్స్
- News
టీడీపీ నేతలపై దాడి చేసిన వైసీపీ నాయకుడికి అందలం: మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా?
- Finance
అమెరికాకు భారీగా అప్పులు, చైనా, జపాన్ నుండే ఎక్కువ: భారత్‌కు ఎంత చెల్లించాలంటే
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రికార్డులు శాశ్వతం కాదు.. ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్.. నా కంచుకోట అదే.. అల్లు అర్జున్
హరిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ నిర్మించిన అల వైకుంఠపురంలో చిత్రం రికార్డుల పరంపర కొనసాగిస్తున్నది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం బాక్పాఫీస్ వద్ద భారీగా వసూళ్లను రాబడతున్నది. ఈ క్రమంలో సక్సెస్ సెలబ్రేషన్స్‌ను వైజాగ్‌లో చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ..

నా కంచుకోట అదే
నా ఫస్ట్ సినిమా షూటింగ్ వైజాగ్‌లోనే జరిగింది. చాలా సినిమాలు వైజాగ్‌లోనే జరిగింది. నాకు బాగా నచ్చిన ప్రదేశం కూడా ఇదే. ప్రతీ ఒక్కరికి ఓ కంచుకోట ఉంటుంది. నాకు మాత్రం వైజాగ్ కంచుకోట అని అందరూ అంటున్నారు. కలెక్షన్లు కూడా అదే నిరూపిస్తున్నాయి. అందుకే నా మొట్టమొదటి థ్యాంక్యూ తెలుగు ప్రేక్షకులకు చెబుతున్నాను అని అల్లు అర్జున్ అన్నారు.

మంచి సినిమా వస్తే
సినిమాకు టెలివిజన్, మొబైల్, ఇతర ప్రసార సాధనాలతో పోటీ పెరిగింది. థియేటర్‌కు ప్రేక్షకులు రావడం లేదనే సమయంలో అల వైకుంఠపురంలో వచ్చింది. మంచి కథ, మంచి సినిమా వస్తే థియేటర్‌కు వచ్చి చూస్తామని తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. అందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను అని అల్లు అర్జున్ అన్నారు.

తమన్‌కు థ్యాంక్స్
తమన్‌కు నా థాంక్స్. ఎందుకంటే సినిమాకు ముందు ఎలాంటి మ్యూజిక్ కావాలంటే.. వన్ బిలియన్ వ్యూస్ వచ్చే ఆడియో కావాలని అడిగాను. నేను అడిగినట్టే నాకు అలాంటి ఆల్బమ్‌ను అందించాడు. సామజవరగమన, రాములో రాములా, ఓ మై డాడీ, బుట్టబొమ్మ పాటలతో గొప్ప ఆడియో ఆల్బమ్‌ను అందించారు. నాకు ఇచ్చిన మాటను నిలబెట్టినందుకు నిజంగా థ్యాంక్స్ చెప్పుకొంటున్నాను అని అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు.

త్రివిక్రమ్ గొప్ప పెయింటర్ లాంటి వాడు
అల వైకుంఠపురంలో ఎంతో మంది సాంకేతిక నిపుణులు, నాతోపాటు ఎంతో మంది నటీనటులు నటించారు. వీరందరికీ హిట్టు ఇచ్చింది దర్శకుడు త్రివిక్రమ్. సినిమాను ఓ పెయింటింగ్‌గా అందంగా తీర్చిదిద్దిన కళాకారుడు లాంటి వ్యక్తి త్రివిక్రమ్. గత సినిమాలు రిలీజ్ అయినప్పుడు డ్యాన్సులు బాగా చేశావని.. ఫైట్లు బాగా చేశావని చెప్పేవాళ్లు. కానీ ఈ సినిమా తర్వాత బాగా ఫెర్ఫార్మెన్స్ చేశావని అంటున్నారు. అందంతా త్రివిక్రమ్ వల్లే అని అల్లు అర్జున్ తెలిపారు.

గత పదేళ్లలో
గత దశాబ్దంలో నేను చేసిన సినిమాలు చూస్తే నాకు సంతృప్తి కలుగలేదు. గొప్ప సినిమాలు చేయలేకపోయాను. అందుకే మంచి సినిమాలు చేయాలని అనుకొన్నాను. 2020లోనే మంచి సినిమా అల వైకుంఠపురంలో వచ్చింది. ఇలాంటి సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. గర్వించ దగిన స్థానానికి వెళ్లేలా.. మిమ్మల్ని తీసుకెళ్లేలా నేను ఉంటానని మాటిస్తున్నాను అని అల్లు అర్జున్ అన్నారు.

రికార్డులు శాశ్వతం కాదు..
అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్‌గా మారిపోతున్నది. ప్రతీ హీరో ఎదో ఒక సమయంలో పెద్ద హిట్టు, రికార్డులు క్రియేట్ చేశారు. రికార్డులనేవి ఈ రోజు నేను క్రియేట్ చేయొచ్చు. కొద్ది రోజుల తర్వాత మరోకరు బ్రేక్ చేయవచ్చు. కానీ ఓ సినిమా చూసినప్పుడు గొప్ప ఫీలింగ్ ఉంటుంది. అదే శాశ్వతం. రికార్డులన్నీ టెంపరరీ. మీ మనసులో ఇచ్చిన స్థానం శాశ్వతం. దానిని విలువ కట్టలేం అని అల్లు అర్జున్ చెప్పారు.