ఐకాన్ కోసం టార్గెట్ సెట్ చేసుకున్న అల్లు అర్జున్..
స్టైలిష్ స్టార్జ్ ఐకాన్ స్టార్ అంటూ విభిన్నమైన ట్యాగ్స్ తో క్రేజ్ పెంచుకుంటున్న అల్లు అర్జున్ పుష్ప తో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ అందుకుంటాడా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా బిగ్ బడ్జెట్ సినిమాలను లైన్ లో పెడుతున్న బన్నీ వీలైనంత తొందరగా ఆ సినిమాలను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. పుష్ప అనంతరం వెంటనే ఐకాన్ ను స్టార్ట్ చేయబోతున్నాడు.
ఐకాన్ సినిమాను వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. బన్నీ ఆ సినిమాను అంతకుముందే ఓకే చేసినప్పటికీ పుష్ప ఆలస్యం కావడం వలన స్టార్ట్ చేయలేకపోయాడు. ఇక వేణు శ్రీరామ్ కన్ఫ్యూజ్ అవుతున్న క్రమంలో మొత్తానికి నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు. పుష్ప ఫస్ట్ పార్ట్ అనంతరం ఐకాన్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని బన్నీ సన్నిహితులు కూడా చెప్పేశారు.

అయితే ఆ సినిమాను మూడు నెలల్లో ఫినిష్ చేయాలని బన్నీ పవర్ఫుల్ ప్లాన్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎంత కాదనుకున్న ఆ సినిమాకు 5నెలల సమయం పడుతుందని కూడా టాక్ వస్తోంది. ఇక ఆ తరువాత సుకుమార్ రెడీ అంటే పుష్ప సీక్వెల్ ను తొందరగా పూర్తి చేసేందుకు రెడీగా ఉన్నాడట. మరి ఆ ప్లాన్ ఎంతవరకు సెట్టవుతుందో చూడాలి. అలాగే కొరటాల శివతో కూడా అల్లు అర్జున్ ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











