For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లు అర్జున్ ఖాతాలో మరో ఘనత: అప్పుడే 80 మిలియన్ దాటేసిన ‘పుష్ప’ వీడియో

  |

  మెగా కాంపౌండ్‌ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్ అన్నింటికీ మించి స్టైల్స్‌లో రాణిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు అల్లు అర్జున్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ను సైతం సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన 'అల.. వైకుంఠపురములో' అనే చిత్రంతో మొట్ట మొదటి ఇండస్ట్రీ హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఈ మెగా హీరో మరిన్ని చిత్రాలను లైన్‌లో పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

  నేను ఆ ప్రాబ్లంతో బాధ పడుతున్నా.. చెప్తే హర్ట్ అవుతారని ఆలోచించా: రోజా షాకింగ్ కామెంట్స్

  ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న 'పుష్ప'లో నటిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తైంది. కరోనా లాక్‌డౌన్‌ల కారణంగా దీన్ని అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోయారు. కానీ, అంచనాలకు అనుగుణంగా రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్ ప్రకటించింది. అందుకు అనుగుణంగానే మొదటి పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ను ముందుగా పూర్తి చేయడానికి ప్లాన్లు చేసుకుంటున్నారు.

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'పుష్ప' సినిమా నుంచి కొద్ది రోజుల క్రితం 'Introducing Pushpa Raj' అనే హీరో పరిచయ వీడియోను విడుదల చేశారు. పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన దీనికి అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. తద్వారా తెలుగులోనే ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్‌గా నిలిచింది. అంతటితో ఈ టీజర్ ప్రభావం తగ్గిపోలేదు. తాజాగా 'పుష్ప' మూవీ టీజర్ 80 మిలియన్ వ్యూస్ మార్కును చేరుకుని మరో ఘనతను సొంతం చేసుకుంది.

  Allu Arjuns Pushpa Teaser Reach 80 Million Views

  ప్రస్తుతం ఇండియాలో ఎక్కువ వ్యూస్ అందుకున్న టీజర్ల జాబితాలో 'కేజీఎఫ్ చాప్టర్ 2' 200 పైచిలుకు మిలియన్ వ్యూస్‌తో మొదటి స్థానంలో ఉండగా.. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' 81 పైచిలుకు మిలియన్ వ్యూస్‌తో రెండో స్థానానికి చేరుకుంది. ఇక, రజినీకాంత్ నటించిన 'రోబో 2.O' మూడో స్థానంలో.. ఇళయదళపతి విజయ్ తాజా చిత్రం 'మాస్టర్' నాలుగో స్థానంలో నిలిచాయి. దీంతో 'పుష్ప' రాజ్ ప్రభావం ఇండియన్ సినిమాపైనా భారీగానే చూపిస్తుందన్న విషయం అర్థం అవుతోంది. ఫలితంగా ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడుతున్నాయి.

  Bheemla Nayak First Glimpse: చరిత్ర సృష్టించిన పవన్.. ప్రభాస్‌ కంటే రెండితలు.. చిరు రికార్డు బద్దలు

  గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో వస్తున్న 'పుష్ప'లో అల్లు అర్జున్ స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం అతడు ఎన్నో సాహసాలు కూడా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇందులో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మధ్యనే విడుదలైన ఫస్ట్ సింగిల్‌కు అన్ని భాషల్లోనూ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

  English summary
  Tollywood Star Hero Allu Arjun Doing Pushpa Under Creative Director Sukumar Direction. Recently This Movie Teaser Reach 80 Million Views Mark in Youtube.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X