Don't Miss!
- News
ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ఇంటికి వెళ్లిన జగన్ దంపతులు
- Finance
Twitter Blue: శుభవార్త చెప్పిన ఎలాన్ మస్క్.. ట్విట్టర్ బ్లూ ఖాతాదారులకు కనకవర్షం..
- Sports
INDvsAUS : ఆసీస్‌కు అది అలవాటే.. అది వాళ్ల మైండ్ గేమ్.. అశ్విన్ ఘాటు రిప్లై!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
దటీజ్ బన్నీ.. కేరళలో ఫాలోయింగ్ చూసి ఫిదా!!
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా కేరళలో బన్నీ ఫాలోయింగ్ చూసి అక్కడి స్టార్ హీరోలు కూడా బెదిరిపోతారు. బన్నీ డబ్బింగ్ సినిమా వస్తేనే మోహన్ లాల్, మమ్ముట్టి వంటి స్టార్ హీరోలు కూడా వెనుకడుగు వేస్తారట. అదీ మన బన్నీ రేంజ్. కేవలం డబ్బింగ్ చిత్రాలతో అక్కడి బాక్సాఫీస్‌పై బన్నీ దండయాత్ర చేస్తాడు.
కేరళ రాష్ట్రంలో జరిగే ప్రధానమైన బోటింగ్ వేడుకలకు బన్నీని ముఖ్య అథితిగా పిలిచారు. అలా ఒక సినీ ఆర్టిస్ట్‌ని అది కూడా తెలుగు వారిని పిలవడం మొదటి సారి. బన్నీ సినిమా వేడుకలు హైద్రాబాద్‌లో జరిగితే అంత దూరం నుంచి వస్తారు. తాజాగా కేరళలో బన్నీ క్రేజ్ చూసిన వ్యక్తి షాక్ అయ్యాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో అన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు మీడియా అడ్వైజర్ అయిన అమర్ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఓ సంఘటనను వివరించాడు. 'నేను కేరళలో ఒక కాలేజీ ప్రోగ్రాం లో ఉన్నప్పుడు ఓ ఇద్దరమ్మాయిలు నా దగ్గరకు వచ్చి అన్న మీకు బన్నీ తెలుసా అని అడిగారు. నిజంగా నాకు అల్లు అర్జున్‌కి ఇంకో పేరు బన్నీ అనేది తెలియదు నేను చాలా షాక్ అయ్యాను. తెలుగు నటుడు కేరళ వరకు వెళ్ళాడు అంటే సామాన్యుడు కాదు.' అంటూ ట్వీట్ చేశాడు. బన్నీ ప్రస్తుతం పుష్ప చిత్రం షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా? అని ఎదురుచూస్తున్నాడు.