For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తండ్రి మరణం గురించి మొట్టమొదటి సారి స్పందించిన యాంకర్ ప్రదీప్.. ఏం చేసినా తక్కువే అంటూ ఎమోషనల్!

  |

  తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశం మొత్తం ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఎంత తీవ్రంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. వైరస్ తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. మొదటి వేవ్ కంటే ఈ రెండో వేవ్ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. సినీ రంగం అలాగే టెలివిజన్ రంగం మీద కూడా ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలకు, నటీనటులకు వైరస్ సోకిన సంగతి తెలిసిందే. అలాగే సెలబ్రిటీలు సైతం తమ ఆత్మీయులను కోల్పోయారు. యాంకర్ ప్రదీప్ తండ్రి కూడా అలాగే కన్నుమూశారు. ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత ప్రదీప్ ఈ విషయం మీద స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే

  30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? Release Date ఫిక్స్
  కరోనా సోకడంతో హోమ్ క్వారంటైన్ లో

  కరోనా సోకడంతో హోమ్ క్వారంటైన్ లో

  టెలివిజన్ యాంకర్ గా పని చేస్తున్న ప్రదీప్ మాచిరాజు కరోనా సోకడంతో గత నెలలో హోమ్ క్వారంటైన్ కే పరిమితం అయ్యాడు. డాక్టర్ల సూచన మేరకు ఇంట్లోనే ఉండి కరోనా వైద్యం తీసుకుంటున్నట్లు అప్పట్లో ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఈ మేరకు పెద్ద ఎత్తున టెలివిజన్ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి ప్రదీప్ మాచిరాజు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

  తండ్రి కూడా కరోనాతో

  తండ్రి కూడా కరోనాతో

  అయితే అలా ప్రచారం జరిగిన వారం రోజులకే ప్రదీప్‌ మాచిరాజు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి పాండు రంగ కన్నుమూశారు. అంతకు ముందే కొద్ది రోజల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మే 1వ తేదీన తుదిశ్వాస విడిచారు. పాండు రంగ కూడా కరోనా బారిన పడినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఆయన కరోనాతో మృతి చెందాడా లేదా ఇతర అనారోగ్య సమస్యలతో చనిపోయాడా అనేది తెలియాల్సి ఉంది.

  అయితే ఇప్పటిదాకా నోరు విప్పని యాంకర్ ప్రదీప్ ఎట్టకేలకు ఈ విషయంలో నోరు విప్పాడు. ఈ మేరకు ఈరోజు(23మే 2021) నాడు సోషల్ మీడియా వేదికగా తన బాధ వ్యక్తం చేశారు. ''ఐ లవ్ యు నాన్న, ఇప్పుడు నేను ఇలా ఉన్నా అంటే దానికి మీరే కారణం మీరే, అలాగే జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా హుందాగా చిరునవ్వు తగ్గకుండా ఎలా ఎదుర్కోవాలో చూపినందుకు మీకు థాంక్యూ, నేనేం చేసినా మీకు గౌరవం కలిగించే పని చేస్తాను మీ జీవితానికి ఒక అర్థం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను'' అని ప్రదీప్ పేర్కొన్నారు.

  మిస్ అవుతూనే ఉంటా

  మిస్ అవుతూనే ఉంటా


  ''నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది మంచి చెడు అనేది ఆలోచించకుండా మీరు నా వెంట నిలబడ్డారు, మీరు ఎంతో ప్రేమతో ముక్కలైన నా మనస్సును ఎన్నో సార్లు బాగు చేశారు, మీ ధైర్యం నాకు ఎన్నో సార్లు స్ఫూర్తినిచ్చింది. అలాగే నా కాళ్ళ మీద నన్ను నిలబడేలా చేసింది. దానిని మించిన ప్రేమ ఏమీ లేదు, మీరు నాకు ఎప్పటికీ స్పెషల్, జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఉండనివ్వండి, మిమ్మల్ని ప్రేమించడం మాత్రం నేను ఆపలేను, మీరు కోరుకున్నట్లుగానే నా జీవితంలో నేను జనాన్ని ఎంటర్టైన్ చేస్తూ వాళ్లకు నవ్వు తెప్పిస్తూనే ఉంటాను, మనం కలిసేదాకా మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటాను నాన్న'' అంటూ ఎమోషనల్ గా ప్రదీప్ ఒక పోస్ట్ చేశాడు.

  యాంకర్ గా బిజీ

  యాంకర్ గా బిజీ


  ప్రస్తుతం ప్రదీప్ ప్ జి తెలుగులో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ షోతో పాటు ఈటీవీలో ప్రసారమవుతున్న డీ డ్యాన్స్ ప్రోగ్రామ్ కి యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డ్రామా జూనియర్స్ సీజన్ ఫైవ్ కి ఎస్ వి కృష్ణారెడ్డి, రేణుదేశాయ్, సింగర్ సునీతలు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.

  ఆమెజాన్ లో రిలీజ్

  ఇక ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా ఈ ఏడాది జనవరి 29వ తారీఖున రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాలో నీలి నీలి ఆకాశం అనే పాట సూపర్ హిట్ కావడంతో ఆ పాట జనాన్ని థియేటర్లకు రప్పించింది. అయితే అనుకున్నంతగా ఈ సినిమా మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. రొటీన్ కథ కావడంతో పాటు నిర్మాణ విలువలు కాస్త అంచనాలకు తగ్గట్టు లేకపోవడంతో ఈ సినిమా కలెక్షన్స్ సాధించలేదు పోయింది. నిన్ననే ఈ సినిమా ఆమెజన్ ప్రైంలో కూడా విడుదలయింది.

  English summary
  Finally anchor pradeep opens up on his fathers death. he shares an emotional note on his fathers demise.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X