నన్ను అలా పిలిస్తే ఎమోషనల్ అయ్యా.. జాన్వీ కపూర్‌ గురించి అర్జున్ కపూర్ షాకింగ్ కామెంట్స్

సినీ పరిశ్రమలో అతిలోక సుందరి శ్రీదేవి మరణానికి ముందు జాన్వీ కపూర్, కుషీ కపూర్ అంటే అర్జున్ కపూర్ కుటుంబానికి చెప్పలేనంత అయిష్టత. తన తల్లికి తండ్రి బోని కపూర్ చేసిన అన్యాయానికి అర్జున్ కపూర్ పీకల్లోతు కోపంతో ఉండేవారు. కానీ శ్రీదేవి మరణించిన తర్వాత జాన్వీ, ఖుషీతో అర్జున్ కపూర్‌కు ఉన్న అంతరాలు తొలిగిపోయాయి. తాజాగా క్లబ్‌హౌస్ యాప్‌లో ది బాలీవుడ్ ఫిల్మ్ క్లబ్‌లో ముచ్చటిస్తున్న సమయంలో తనను అర్జున్ భయ్యా అంటూ జాన్వీ కపూర్ సంబోధించగానే తాను భావోద్వేగానికి గురయ్యాను అంటూ అర్జున్ కపూర్ తన ఎమోషనల్ విషయాలను పంచుకొన్నారు.

నా సోదరి అన్షులా కపూర్ నన్ను భయ్యా అని పిలుస్తుంది. కానీ తను పిలిచే తీరు.. జాన్వీ కపూర్ పిలిచే విధానంలో చాలా తేడా ఉంటుంది. అర్జున్ భయ్యా అని పిలవడంతో నాకు ఒక రకమైన పులకింత కలిగింది. ఆ భావనను మాటల్లో చెప్పలేను అని అర్జున్ కపూర్ అన్నారు. నేను ఎప్పుడు అలా ఇలా పిలువమని చెప్పలేదు. కానీ జాన్వీ నోటి నుంచి అలా సహజసిద్ధంగా రావడంతో చాలా సంతోషం వేసింది అని అన్నారు.

Arjun Kapoor reveals equation with Janhvi and Khushi Kapoor

ఇటీవల బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ జాన్వీ, కుషితో ఉన్న అనుబంధాన్ని వెల్లడించారు. మాది ఫర్‌ఫెక్ట్ ఫ్యామిలీ అంటే అది హిపోక్రసి అవుతుంది. మా మధ్య రకరకాల ఓపీనియన్స్ ఉన్నాయి. మావి ఇప్పటికి వేర్వేరు ఫ్యామిలీలే. చాలా రోజులుగా కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నాం. మేము కలుసుకొన్నప్పుడు మా మధ్య మంచి అనుబంధాలు కనిపిస్తాయి. కానీ మాది పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ అని అబద్ధం చెప్పను అని అన్నారు.

మా మధ్య, మా కుటుంబాల మధ్య కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి. ఐనప్పటికి కొన్ని పరిస్థితులు మమ్మల్ని కలిసేలా చేశాయి. ముక్కలుగా మారిన జీవితాలు మావి. మా జీవితాల్లో చాలా గ్యాప్ ఉంది. దానిని పూరించడానికి ప్రయత్నిస్తున్నాం. అని అర్జున్ కపూర్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X