For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Hero OTT: ఆ ఓటీటీలోకి మహేశ్ మేనల్లుడి సినిమా.. ఎప్పటి నుంచి రాబోతుందంటే!

  |

  ఈ మధ్య కాలంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఉన్న వారసులు హీరోలుగా పరిచయం అయిన విషయం తెలిసిందే. అయితే, అందులో చాలా మంది మొదటి చిత్రంతోనే భారీ సక్సెస్‌ను అందుకుంని గ్రాండ్ ఎంట్రీని దక్కించుకున్నారు. కానీ, కొందరికి మాత్రం నిరాశే ఎదురు అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ 'హీరో' అనే చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించారు.

  యంగ్ క్రికెటర్‌తో బాలయ్య హీరోయిన్ నైట్ పార్టీ: ఇద్దరూ అలా దొరికిపోవడంతో కలకలం!

  అశోక్ గల్లా నటించిన 'హీరో' సినిమా ఎన్నో అంచనాలతో రూపొందింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 5.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దీంతో సంక్రాంతి రేసులో నిలిచిన ఈ చిత్రం ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. అందుకు అనుగుణంగానే దీనికి ఆరంభం నుంచే మంచి టాక్ కూడా దక్కింది. అయితే, కలెక్షన్లు మాత్రం అనుకున్న రీతిలో రాలేదు. ఫలితంగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశజనకమైన వసూళ్లతోనే రన్‌ను ముగించుకుంది.

  Ashok Gallas Hero Movie Streaming on Disney Hotstar From Feb 11th

  సంక్రాంతి పండుగ కానుకగా థియేటర్లలో సందడి చేసిన 'హీరో' మూవీని ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్‌ గురించి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సోషల్ మీడియాలో కీలక ప్రకటన చేసింది. అందులో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. అంతేకాదు, 'ఈ హీరోను మీరు మిస్ కాలేదు. ఉల్లాసకరమైన కామెడీ ఎంటర్‌టైనర్‌ను ఫిబ్రవరి 11 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చూడండి' అంటూ వెల్లడించింది.

  బీచ్‌లో ప్యాంట్ లేకుండా బిగ్ బాస్ దివి రచ్చ: వామ్మో ఈ తెలుగు పిల్లను ఇలా చూశారంటే!

  'హీరో' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. హీరోగా పరిచయమైన సినిమానే అయినా అశోక్ గల్లా చాలా బాగా నటించాడన్న టాక్ వినిపించింది. అయితే, ఈ సినిమా టాక్‌కు అనుగుణంగా ప్రేక్షకులను థియేటర్లకు రాబట్టలేకపోయింది. దీంతో దీనికి కలెక్షన్లు సోసోగానే వచ్చాయి. ఇక, ఏపీలో కర్ఫ్యూ పెట్టి ఆక్యూపెన్సీ తగ్గించడంతో మరింతగా పడిపోయాయి. ఫలితంగా ఈ సినిమా నష్టాలనే మిగిల్చింది. కానీ, హీరోగా అశోక్‌ మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో ఇదే ఉత్సాహంతో అతడు ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకోవాలని డిసైడ్ అయిపోయాడు.

  గల్లా అశోక్‌ను పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రమే 'హీరో'. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. సూపర్ స్టార్ కృష్ణ, గల్లా అరుణకుమారి, సమర్పణలో అమర రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మించారు. గిబ్రాన్ మ్యూజిక్ అందించాడు. ఇక, ఇందులో జగపతి బాబు, నరేష్, అర్చన అనంత్, వెన్నెల కిశోర్, రవి కిషన్, బ్రహ్మాజీ, కోటా శ్రీనివాసరావు సహా ఎంతో మంది కీలక పాత్రలను పోషించారు.

  English summary
  Mahesh Babu nephew Ashok Galla Did Hero Movie Under Sriram Aditya Direction. This Movie Streaming on Disney+ Hotstar From Feb 11th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X