వాళ్ళతో కలిసి పుట్టినరోజు వేడుకను జరుపుకున్న బాలకృష్ణ.. అభిమనులు కూడా అదే బాటలో..
టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ నేడు 61వ వసంతంలోకి అడుగు పెట్టడంతో దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదే విధంగా రాజకీయ నాయకులు, క్రికెటర్లు, సినీ ప్రముఖుల నుంచి కూడా బాలయ్యకు పుట్టినరోజు విషెస్ అందుతున్నాయి. ఇక బాలకృష్ణ తన పుట్టినరోజు వేడుకను ఉదయాన్నే ముఖ్యమైన సిబ్బందితో జరుపుకున్నట్లు తెలిపారు.
'నా ప్రియమైన తండ్రి శ్రీ నందమూరి తారక రామరావు గారు, తల్లి శ్రీమతి బసవతారకం గారు ఆశీర్వాదంతో, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి సిబ్బందితో నా పుట్టినరోజును జరుపుకున్నాను. నిరుపేద క్యాన్సర్ రోగుల సంక్షేమానికి తోడ్పడగలిగినందుకు నిజంగా ఆశీర్వాదం.. అంటూ బాలకృష్ణ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.

ఇక మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులు ఈసారి హీరో చెప్పినట్లుగానే ఆడంబరాలకు దూరంగా ఉన్నారు. అయితే కరోనా కష్టకాలంలో వీలైతే సహాయం చేయండి అని చెప్పడంతో కొందరు అభిమానులు అనుకున్నట్లే మంచి పనులతో ఆకట్టుకుంటున్నారు. తిరుపతిలో నందమూరి అభిమానులు కరోనా బాధితులకు అలాగే నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందించారు.
ఇక బాలకృష్ణ ఉదయం బసవతారకం హాస్పిటల్ లో రోగులను సందర్శించి అక్కడ వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. నేడు సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి బాలయ్య మరోసారి పుట్టినరోజు వేడుకలు జరుపుకొనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











