Balakrishna బ్రాండ్ ఇమేజ్ మామూలుగా లేదుగా.. Sai Priya group యాడ్‌కు రెమ్యునరేషన్ ఎంతంటే?
నందమూరి బాలకృష్ణ కెరీర్ పరంగా టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు సినిమాలకే పరిమితమైన ఆయన ఇప్పుడు వినోద పరిశ్రమలో పలు విభాగాల్లో ఎన్నడూ లేని విధంగా రాణిస్తున్నారు. తన 40 ఏళ్లకుపైగా సినీ కెరీర్‌లో టెలివిజన్‌లో హోస్ట్‌గా, వ్యాపార ప్రకటన రంగంలో బ్రాండ్ అంబాసిండర్‌గా కొత్త అవతారం ఎత్తారు. అయితే తాజాగా ఓ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన ఆయన భారీ రెమ్యునరేషన్ అందుకోవడం సినిమా పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఆ రెమ్యునరేషన్ వివరాల్లోకి వెళితే..

అఖండతో సత్తా చాటిన బాలయ్య
బాలకృష్ణ ఇటీవల కాలంలో వరుస విజయాలతో అద్బుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. ఇటీవల వచ్చిన అఖండ చిత్రంతో కలెక్షన్ల పరంగా తన స్టామినాను మెరుగుపరుచుకొన్నారు. ఇక అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని లాంటి దర్శకులతో క్రేజీ ప్రాజెక్టులను పట్టాలెక్కించారు. కెరీర్ పరంగా బిజీగా ఉంటూ భారీ సినిమాల్లో నటిస్తున్నారు.

ఎమ్మెల్యేగా.. ప్రజాసేవలో
నటుడిగానే కాకుండా రాజకీయ నేతగా, ఎమ్మెల్యేగా రెండు పడవలపై విజయవంతంగా తన జర్నీని కొనసాగిస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తూ.. మరో వైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇలా బిజీగా ఉంటూనే ఆహా ఓటీటీలో హోస్ట్‌గా రాణిస్తున్నారు.

బాలకృష్ణ అన్‌స్టాపబుల్ 2
ఇటీవల ప్రారంభమైన ఆహా ఓటీటీ షో అన్‌స్టాపబుల్ 2 షోతో భారీ రేటింగ్‌ను, ప్రేక్షకుల అభిమానాన్ని రెట్టింపు చేసుకొన్నారు. టాక్ షోలకే అమ్మ మొగుడు లాంటి షోగా అన్ స్టాపబుల్‌గా మార్చారు. ఈ టాక్ షోతో ప్రేక్షకుల, అభిమానుల మైండ్ సెట్‌ను మార్చేశారు. ఇలా బాలకృష్ణ తనను తాను కొత్త కోణంలో ఆవిష్కరించుకొని జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు.

బ్రాండ్ అంబాసిడర్‌గా
బాలకృష్ణ ప్రొఫెషనల్ జర్నీలో మరికొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనల్లో నటించిన బాలయ్య ప్రస్తుతం ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం ఆసక్తికరమైన పరిమాణంగా మారింది. సాయి ప్రియ కన్‌స్ట్రక్షన్ గ్రూపుకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీ నిర్వహించిన మీడియా సమావేశంలో తన జీవితంలో కొత్త విషయం చోటు చేసుకొన్నదని చెబుతున్నారు.

వ్యాపార ప్రకటన కోసం రెమ్యునరేషన్
అయితే సాయి ప్రియ గ్రూప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న బాలకృష్ణకు భారీగా రెమ్యునరేషన్‌ను ముట్టజెప్పినట్టు సమాచారం. బాలకృష్ణ ఒక్కో సినిమాకు 12 కోట్లు తీసుకొంటున్నట్టు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. అయితే సాయిప్రియ కంపెనీ కోసం యాడ్‌లో నటించినందుకు గాను.. 14 కోట్ల వరకు కంపెనీ నిర్వాహకులు ముట్టజెప్పినట్టు తెలిసింది. దాంతో మరోసారి బాలయ్య ట్రేడ్ వర్గాల మైండ్‌సెట్ మార్చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











