For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘ఖిలాడీ’ మూవీకి ఓటీటీ నుంచి బిగ్ ఆఫర్: ఫ్యాన్స్‌ కోసం రవితేజ కీలక నిర్ణయం

  |

  కొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతం అవుతూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు మాస్ మహారాజా రవితేజ. రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన అతడు.. ఈ ఏడాది ఆరంభంలో 'క్రాక్' మూవీతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మాస్ ఎంటర్‌టైనర్ మూవీ కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. ఫలితంగా రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ మూవీ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతోనే ఈ స్టార్ హీరో వెంటనే 'ఖిలాడీ' అనే సినిమా స్టార్ట్ చేశాడు.

  SR Kalyanamandapam 5Days Collections: చిన్న మూవీకి రికార్డు కలెక్షన్లు.. అప్పుడే అన్ని కోట్ల లాభాలు

  మాస్ మహారాజా రవితేజ - రమేష్ వర్మ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం 'ఖిలాడీ'. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ కరోనా ముందు వరకూ శరవేగంగా సాగుతూ వచ్చింది. సెకెండ్ వేవ్ వచ్చిన తర్వాత విదేశాల్లో జరగాల్సిన షెడ్యూల్‌కు బ్రేక్ పడిపోయింది. దీనికితోడు సదరు దేశానికి వెళ్లేందుకు పర్మీషన్ దొరకకపోవడంతో దీన్ని అలా ఆపేసి మరో సినిమాను మొదలు పెట్టాడు రవితేజ. ఇక, సుదీర్ఘమైన విరామం తర్వాత ఇటీవలే హైదరాబాద్‌లో 'ఖిలాడీ' సినిమా షూటింగ్‌ను పున: ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ న్యూస్ లీకైంది.

  మాస్ మహారాజా రవితేజకు మాస్ ఆడియెన్స్‌లో భారీ ఫాలోయింగ్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకునేందుకు 'ఖిలాడీ' సినిమాను ఓటీటీకి అమ్మేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని వాళ్లు డిసైడ్ అయినట్లు క్లారిటీ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. 'ఖిలాడీ' మూవీకి ఓ ఓటీటీ సంస్థ నుంచి ఇప్పుడు బిగ్ ఆఫర్ వచ్చిందని తెలిసింది. ఇది దాదాపు రూ. 40 కోట్లు ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో ఈ మూవీ పేరు ఇండస్ట్రీ ఏరియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

  Big OTT Offer for Khiladi Movie: Ravi Teja Rejected

  'ఖిలాడీ'కి ఓటీటీ ఆఫర్ రావడంతో పాటు మరో న్యూస్ కూడా ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు రవితేజ సుముఖంగా లేడట. తన చిత్రాన్ని ఫ్యాన్స్ థియేటర్లలోనే చూసి ఎంజాయ్ చేయాలనుకుంటారు. అందుకు అనుగుణంగానే తన సినిమాలను సినిమా హాళ్లలోనే రిలీజ్ చేయాలని అతడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలకు తేల్చి చెప్పేశాడట ఈ మాస్ హీరో. దీంతో వాళ్లు కూడా సదరు ఓటీటీ సంస్థ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ వార్తలకు పుల్‌స్టాప్ పడింది.

  తల్లైనా తగ్గని రామ్ చరణ్ హీరోయిన్ రచ్చ: అందాలు మొత్తం కనిపించేంత దారుణంగా ఫోజులు

  భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఖిలాడీ' మూవీలో రవితేజ డుయల్ రోల్ చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ మూవీ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక, ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు.

  English summary
  Mass Maharaj Ravi Teja Doing Khiladi Movie Under Ramesh Varma Direction. Now Famous OTT Gave Big Offer to This Movie. But Ravi Teja Rejected It.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X