For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రభాస్ స్టామినాను నిరూపించే న్యూస్: ‘రాధే శ్యామ్’ టైటిల్స్‌కే అంత ఖర్చు.. అందుకే బడ్జెట్ ఎక్కువ

  |

  టాలీవుడ్ టాప్ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్ తర్వాత నుంచి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం సుజిత్‌తో కలిసి 'సాహో' అనే సినిమాను చేశాడు. ఈ చిత్రం అన్ని భాషల్లో నిరాశనే మిగిల్చినా.. హిందీలో మాత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో మనోడికి అక్కడ ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్ కూడా భారీగా పెరిగిపోయింది. ఈ జోష్‌లోనే అప్పటి నుంచి వరుసగా పాన్ ఇండియా చిత్రాలనే చేస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం అతడు నటిస్తోన్న సినిమాల్లో 'రాధే శ్యామ్' ఒకటి. తాజాగా దీని గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆ వివరాలు మీకోసం!

   రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో ప్రభాస్

  రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో ప్రభాస్

  సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో ప్రభాస్ ఎన్నో తరహా పాత్రల్లో నటించాడు. అయితే, తొలిసారి అతడు ‘రాధే శ్యామ్' రొమాంటిక్ రోల్‌ను చేస్తున్నాడు. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

  సెక్స్ లేకుండా ఉండలేవా: శృతి హాసన్‌కు నెటిజన్ సూటి ప్రశ్న.. చీకట్లో ఉంటే అంటూ షాకింగ్ ఆన్సర్!

  కార్ల దొంగగా ప్రభాస్.. అలాంటి కథ

  కార్ల దొంగగా ప్రభాస్.. అలాంటి కథ

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘రాధే శ్యామ్' మూవీలో ప్రభాస్ కార్ల దొంగగా నటిస్తోన్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అలాగే, ఇందులో అతడు రెండు డిఫరెంట్ రోల్స్ చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ చిత్రం టైమ్ ట్రావెల్ కథతో నడుస్తుందని.. పునర్జన్మల నేపథ్యంతో సాగే సినిమా అని టాక్స్ వినిపిస్తోన్న విషయం తెలిసిందే.

  రిలీజ్ డేట్.. ప్రమోషన్స్ ప్లాన్ చేసి

  రిలీజ్ డేట్.. ప్రమోషన్స్ ప్లాన్ చేసి

  ‘రాధే శ్యామ్' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వీలైనంత త్వరగా ప్రారంభించి.. ప్రేక్షకులకు ఈ సినిమాను మరింత చేరువ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ నుంచి ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించబోతున్నారని ఓ న్యూస్ లీకైంది.

  అషు రెడ్డి క్యారెక్టర్‌పై కమెడియన్ సంచలన వ్యాఖ్యలు.. అందుకే అలా చూపిస్తూ తిరుగుతుందంటూ!

  అక్కడ భారీ సెట్ ఏర్పాటు చేస్తోంది

  అక్కడ భారీ సెట్ ఏర్పాటు చేస్తోంది

  ‘రాధే శ్యామ్' మూవీకి సంబంధించిన షూటింగ్ మొత్తం ఇప్పటికే పూర్తైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ కూడా వెల్లడించింది. అయితే, ఇప్పుడు ఈ మూవీ షూటింగ్‌ను చేయబోతున్నారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. కానీ, ఇది టాకీ పార్ట్‌కు సంబందించిన షూట్ కాదు.. సినిమా టైటిల్ కార్డ్స్‌ కోసం తీసేదని తెలిసింది. దీని కోసం ఓ భారీ సెట్‌ను కూడా నిర్మించారని టాక్.

  ‘రాధే శ్యామ్' టైటిల్స్‌కే అంత ఖర్చు

  ‘రాధే శ్యామ్' టైటిల్స్‌కే అంత ఖర్చు

  ‘రాధే శ్యామ్' మూవీ ఆరంభంలో, చివర్లో టైటిల్ కార్డ్స్ పడే సమయంలో వచ్చే విజువల్స్ కోసం ఓ భారీ సెట్టింగ్ నిర్మించి చిత్రీకరణ జరపబోతున్నారు. కేవలం మూడే మూడు నిమిషాల పాటు ఉండే ఈ ఎపిసోడ్ కోసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు. గండికోట సమీపంలో నిర్మిస్తోన్న ఈ సెట్, షూటింగ్ ప్రాసెస్ కోసం దాదాపు 30 లక్షల రూపాయల ఖర్చు అవుతుందట.

  సుడిగాలి సుధీర్‌పై దీపిక సంచలన వ్యాఖ్యలు: వద్దన్నా ఇంటికి వస్తాడంటూ మరీ దారుణంగా!

  ప్రభాస్ రేంజ్‌కు తగ్గట్లుగానే బడ్జెట్

  ప్రభాస్ రేంజ్‌కు తగ్గట్లుగానే బడ్జెట్

  సాధారణంగా ప్రభాస్ సినిమాలకు భారీ బడ్జెట్‌ను కేటాయిస్తుంటారు నిర్మాతలు. ఇప్పుడు ‘రాధే శ్యామ్' మూవీ టైటిల్ కార్డ్స్ కోసమే ఈ రేంజ్‌లో ఖర్చు చేస్తే.. సినిమా మొత్తానికి ఏ మేర బడ్జెట్ పెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రభాస్ స్టామినాను అద్దం పట్టే అంశం అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీనిపై అతడి ఫ్యాన్స్ స్పందిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్నారు.

  English summary
  Young Rebel Star Prabhas upcoming film is Radhe Shyam Under Radha Krishna Kumar Direction. Now Big Set Built for This Movie Title Cards Shoot.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X