Just In
- 7 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 8 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 9 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 10 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్: రక్తంలో చక్కెర నియంత్రణకు నిద్ర అవసరమా? రెండింటి మధ్య సంబంధాన్ని తెలుసుకోండి
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్'లో విజయ్ చిన్న పాత్రలో.. నాకు ముందే తెలుసు: అభిజిత్ కామెంట్స్
టాలీవుడ్ లో ప్రస్తుతం అభిజిత్ హాట్ టాపిక్ గా నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా నిలిచిన అభిజిత్ అభిమానుల సంఖ్యను కూడా గట్టిగానే పెంచుకున్నాడు. ఒక సినిమాతో వచ్చిన గుర్తింపుతో బిగ్ బాస్ వరకు వెళ్లిన ఈ హీరో మరో స్థాయికి వెళ్ళాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అతని పేరు వైరల్ అవుతోంది. ఇక న్యూస్ ఛానెల్స్ కు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న అభి ఇటీవల విజయ్ దేవరకొండపై కూడా పాజిటివ్ కామెంట్స్ చేశాడు.

కరెక్ట్ గా రెండు సినిమాలు పడితే..
చూస్తుంటే అభిజిత్ త్వరలోనే హీరోగా బిజీ అయ్యేలా కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు బిగ్ బాస్ ద్వారా విన్నర్ గా నిలిచిన కంటెస్టెంట్ అయితే సినీ కెరీర్ లో పెద్దగా సక్సెస్ అయ్యింది లేదు. కానీ అభిజిత్ కు దక్కిన రెస్పాన్స్ మామూలుగా లేదు. కరెక్ట్ గా రెండు సినిమాలు పడితే అతని స్థాయి మరో రేంజ్ కు వెళుతుంది.

బిజీ బిజీగా..అభిజిత్
ఆదివారం రాత్రి నుంచి కూడా అభిజిత్ చాలా బిజీగా కనిపిస్తున్నాడు. గ్యాప్ లేకుండా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఇక హౌజ్ లో ఉన్నప్పుడు బయట నుంచి తనకు సపోర్ట్ అంధించి వారికి ప్రత్యేకంగా కలుసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు అభిజిత్. ఇక ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండతో తనకున్న రిలేషన్ గురించి కూడా క్లారిటి ఇచ్చాడు.

విజయ్ దేవరకొండ చిన్న పాత్రలో..
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా ద్వారా అభిజిత్ హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. అందులో విజయ్ దేవరకొండ ఒక చిన్న పాత్ర చేశాడు. ఇప్పుడు విజయ్ ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అలాంటి నటుడిపై మీ అభిప్రాయం ఏమిటని అడుగగా.. అతని టాలెంట్ గురించి నాకు ముందే తెలుసని అభిజిత్ వివరణ ఇచ్చాడు.

నాకు ముందే తెలుసు
విజయ్ దేవరకొండ మై మ్యాన్.. నాకు దగ్గరగా ఉండే స్నేహితుడు. విజయ్ గురించి నాకు ముందే తెలుసు. అయితే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లో నటించిన ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రతిభావంతులే. శేఖర్ కమ్ముల గారు ఆడిషన్స్ మామూలుగా చేయరు. ఆయన ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా టెస్ట్ చేస్తారు. ఆ సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలాంటి వారే.. కానీ ఎవరికైనా ఒక మంచి అవకాశం అలాగే ఆ టైమ్ కూడా రావాలి అంటూ వివరణ ఇచ్చాడు.

విజయ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు
ఇక విజయ్ నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా మద్దతు ఇచ్చాడు. అందుకే ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అతనితో పాటు మిగతా లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ నటీనటులు తనకు టచ్ లో ఉన్నారని అంటూ అందులో సుధాకర్ కూడా ఉన్నాడని వారందరికీ అలాగే సపోర్ట్ చేసిన కొంతమంది సినీ స్టార్స్ కు ఎంత కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువేనని అభి వివరణ ఇచ్చాడు.