ద్వేషిస్తూ సందేశాలు, ఒత్తిడికి గురయ్యా... మనుషులు ఇలా ఉంటారని తెలుసుకున్నా : నాని

బిగ్ బాస్ తెలుగు సెకండ్ సీజన్ ద్వారా టీవీ హోస్ట్‌ అవతారం ఎత్తిన హీరో నాని.... ఈ రియాల్టీ షోకు పని చేయడం ఒక సరికొత్త అనుభూతి అని, ఈ షో తనను రియల్ ప్రపంచానికి పరిచయం చేసిందని తెలిపారు. గత ఆదివారం ముగిసిన బిగ్ బాస్ తెలుగు 2 రియాల్టీ షోలో కౌశల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

Recommended Video

Natural Star Nani Interview About Devadas Movie

బిగ్ బాస్ తర్వాత ఈ ప్రపంచాన్ని నేను చూసే దృష్టి కోణం మారింది. ఈ షోకు రాక ముందు నేను ఒక నీటి బుడగ లాంటి చిన్న ప్రపంచంలో జీవించాను. నిజమైన ప్రపంచం చాలా సంతోషమైన ప్రదేశం అనుకున్నాను. కానీ నా అభిప్రాయం నిజం కాదని బిగ్ బాస్ షో తర్వాతే తెలిసిందని నాని తెలిపారు.

ఈ షో నన్ను నిజమైన ప్రపంచంలోకి...

ఈ షో నన్ను నిజమైన ప్రపంచంలోకి...

బిగ్ బాస్ షో తర్వాత నేను రియలైజ్ అయ్యాను. ఈ ప్రపంచంలో మనల్ని జడ్జ్ చేసే మనుషులతో సహా, అన్ని రకాల మనుషులు ఉంటారని తెలుసుకున్నాను. ఈ రియాల్టీ షో నన్ను నిజమైన ప్రపంచానికి పరిచయం చేసిందని నాని అన్నారు.

విధ్వేషపూర్తిమైన సందేశాలు ఇప్పుడే వచ్చాయి

విధ్వేషపూర్తిమైన సందేశాలు ఇప్పుడే వచ్చాయి

‘నా జీవితంలో ఇప్పటి వరకు నన్ను ద్వేషిస్తూ ఇన్ని సందేశాలను ఎప్పుడూ రాలేదు. అలాంటి సందర్భాలు కూడా నేను ఎప్పుడూ చూడలేదు. ఈ షో చేసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. మనం అందరినీ సంతృప్తి పరిచయలేమని తెలుసుకున్నాను. ఈ ప్రపంచంలో మనల్ని ఇష్టపడని వారు కూడా ఉంటారు. అలాంటి వారిని మనం ఏం చేసినా సంతోషపెట్టలేమని అర్థమైంది' అని నాని చెప్పుకొచ్చారు.

ఈ మూడు నెలలు చాలా ఒత్తిడికి గురయ్యాను

ఈ మూడు నెలలు చాలా ఒత్తిడికి గురయ్యాను

గడిచిన మూడు నెలలు నా కెరీర్లో అత్యంత ఒత్తిడితో కూడుకున్న సమయం. ఒకే సంవత్సరం మూడు సినిమాలు చేసిన సమయంలో కూడా ఇంత ఒత్తిడి ఫేస్ చేయలేదు. వరుస సినిమాలు చేస్తూనే సాధారణ వీకెండ్స్ కాకుండా కనీసం రెండు వారాలు ఫ్యామిలీతో గడిపేవాడిని, కానీ బిగ్ బాస్ కోసం నేను అనుకున్న దానికంటే ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. అదే సమయంలో దేవదాస్ సినిమా షూటింగులో పాల్గొనాల్సి వచ్చింది. ఇపుడు తప్పకుండా హాలిడే తీసుకోవాల్సిన సమయం వచ్చింది అని నాని అన్నారు.

దేవదాస్ సినిమా గురించి

దేవదాస్ సినిమా గురించి

తన తాజా చిత్రం ‘దేవదాస్' గురించి మాట్లాడుతూ.... ఈ సినిమా ఐడియా బాలీవుడ్ రైటర్ శ్రీధర్ రాఘవన్ ద్వారా వచ్చిందని, నాగ్ సర్.. నేను కథ విన్న తర్వాత ఇక్కడి నేటివిటీకి తగిన విధంగా చేయాలనుకున్నామని నాని తెలిపారు.

ఆనయతో చేసే ఛాన్స్ రావడం అదృష్టం

ఆనయతో చేసే ఛాన్స్ రావడం అదృష్టం

నాగ్ సర్‌తో కలిసి పని చేయడం నా అదృష్టంగా భావిస్తుననాను. ఎందుకంటే నేను ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన నటించిన ఎన్నో సినిమాలకు క్యూలో నిల్చొని టికెట్స్ తీసుకున్నాను. అలాంటి నేను నాగ్ సర్‌తో కలిసి నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదని నాని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X