Just In
Don't Miss!
- News
Tractor rally: ట్రాక్టర్ల నెంబర్లు రాసుకున్న పోలీసులు, అమ్రేష్ పురి టైపులో ఓం భ్రీమ్ బ్రుష్!
- Sports
సైనీ గాయం గురించి మర్చిపోయా.. మూడో పరుగు కోసం రమ్మన్నాను! అంతలోనే: పంత్
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాంచరణ్‌ను చూస్తే ఈర్ష.. చెర్రీకి 2వ సినిమాలో.. నాకు 151 మూవీలో అంటూ చిరంజీవి
ప్రతిష్టాత్మకం రూపొందిన సైరా చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకొన్నాయి. నిన్న ముంబైలో ప్రమోషన్ కార్యక్రమాలు ముగించుకొని శనివారం చెన్నైలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాంచరణ్, తమిళ నిర్మాతలు, దర్శకులతోపాటు సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ..

12 ఏళ్ల క్రితం
సైరా చిత్రం ఎన్నో ఏళ్లుగా ఉన్న నా కల. ఇప్పుడు ఇలా నెరవేరుతుంది. 12 ఏళ్ల క్రితం స్టార్ రైటర్లు పరుచూరి సోదరులు నాకు కథ చెప్పారు. అప్పుడే చేద్దామని అనుకొన్నాను. కానీ అప్పుడే 70 కోట్ల బడ్జెట్ కావాల్సి వచ్చింది. కానీ మేము అనుకొన్నది రూ.40 కోట్లే. కానీ బాహుబలి1 తర్వాత మాకు నమ్మకం కలిగింది. బడ్జెట్ ఎంతైనా సరే. మనకు వచ్చేస్తుందనే నమ్మకంతో రాంచరణ్ ముందుకు వచ్చాడు. అలా సైరా కల సాకారమైంది.

ఖైదీ నంబర్ 150తో
సైరా సినిమాను 12 ఏళ్ల క్రితమే చేయాలనుకొన్నాం. కానీ నాకు 9 ఏళ్ల గ్యాప్ వచ్చింది. జనరేషన్ మారింది నన్ను అంగీకరిస్తారా అనే అనుమానం కలిగింది. అయితే అలాంటి పరిస్థితుల్లో తమిళంలో విజయం సాధించిన కత్తి సినిమాను ఖైదీ నంబర్ 150గా తీసాం. ఏపీలో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించింది. ఆ తర్వాత నాకు నా మీద, ప్రేక్షకుల మీద మరింత నమ్మకం కలిగింది.

రాంచరణ్‌ను చూస్తే ఈర్ష
సైరా సినిమాకు ముందు రాంచరణ్ చూస్తే ఈర్ష కలిగేది. తన రెండో సినిమాకే క్యాస్టూమ్ డ్రామా చేసే అవకాశం మగధీర రూపంలో వచ్చింది. నేను 150 సినిమాలు చేస్తే గానీ సైరా రూపంలో క్యాస్టూమ్ డ్రామాతో కూడిన సినిమాగా వచ్చింది. రాంచరణ్ ఈ సినిమాను రూపొందించి నాకు గిఫ్ట్ ఇచ్చారు. సాధారణంగా కొడుకును తండ్రి ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు తండ్రిని ప్రమోట్ చేస్తున్న రాంచరణ్ చూస్తున్నాను అని చిరంజీవి అన్నారు.

అరవింద్ స్వామి నాకు డబ్బింగ్
తమిళంలో నాకు డబ్బింగ్ అరవింద్ స్వామి చెప్పారు. అందుకు నా థ్యాంక్స్. అలాగే సినిమాలో ఆరంభం.. క్లైమాక్స్‌లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి. వాటిని నా మిత్రుడు కమల్ హాసన్ చెప్పారు. అడగ్గానే నా సినిమాకు గొంతును ఇచ్చిన కమల్‌కు థ్యాంక్స్. మలయాళంలో మోహన్ లాల్ చెబుతున్నారు. తెలుగులోనా సోదరుడు పవన్ కల్యాణ్ చెప్పారు.

విజయ్ సేతుపతి గ్రేట్
ఇక సైరాలో కీలక పాత్రలో నటించిన విజయ్ సేతుపతికి ధన్యవాదాలు. విజయ్ సేతుపతి గొప్ప నటుడు. ఈ చిత్రంలో ఆయన పాత్ర అద్భుతంగా ఉంటుంది. సైరా తెలుగు సినిమా కాదు. రిజినల్ సినిమా అంతకంటే కాదు. ఇది ఇండియన్ సినిమా అని అన్నారు. ఈ చిత్రంలో నటించమని అడిగినప్పుడు అమితాబ్ వెంటనే ఒప్పుకొన్నాడు. ఆయన ఆశీస్సులతో ఈ సినిమా విజయవంతం అవుతుంది అని చిరంజీవి పేర్కొన్నారు.