చాలా సంవత్సరాల తర్వాత శబరిమలకు చిరంజీవి.. డోలీలో వెళ్లవలిసి వచ్చిందంటూ నోట్!

మెగాస్టార్‌ చిరంజీవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించి సమస్యల పరిష్కారం కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీకి వెళ్లేందుకు సినీ ప్రముఖులను సమాయత్తం చేసి ఆయన అక్కడికి తీసుకు వెళ్ళారు. అయితే ఆయన ఇప్పుడు వరుస దైవ దర్శనాలతో బిజీగా గడుపుతున్నారు. ఆయన శబరిమల వెళ్ళిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ వివరాలు

ముచ్చింతల్‌లో

ముచ్చింతల్‌లో

శనివారం చిరంజీవి హైదరాబాద్‌ శివారు ప్రాంతం ముచ్చింతల్‌లోని కొత్తగా నిర్మించిన శ్రీ రామానుజ సమతామూర్తి సన్నిధిని సందర్శించారు. సతీమణి సురేఖతో పాటు చిరంజీవి సహస్రాబ్ది వేడుకలో పాల్గొని చిన జీయర్‌ స్వామి ఆశీర్వచనాలు కూడా తీసుకున్నారు. ఇక అక్కడికి వెళ్ళిన చిరంజీవి భాగంగా సమతా మూర్తి ఆశ్రమంలో ఉన్న 108 దివ్య దేశాల దేవాలయాలను కూడా చిరంజీవి సతీ సమేతంగా దర్శించుకున్నారు.

పూజారుల ఆశీర్వాదాలు

పూజారుల ఆశీర్వాదాలు

ఇక అక్కడి నుంచి నేరుగా ఎయిర్ పోర్టుకు వెళ్లి కొచ్చి వెళ్ళిన చిరంజీవి దంపతులు అటు నుంచి శబరిమల వెళ్లి పద్దెనిమిది కొండల్లో నెలవై ఉన్న అయ్యప్ప ఆలయాన్ని సందర్శించారు. కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం నెలలో ఐదు రోజుల పాటు మాస పూజల కోసం తెరుచుకుంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగాస్టార్‌ దంపతులు సందర్శించి స్వామి వారి దర్శనం పొందడమే కాక పూజారుల ప్రత్యేక ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

చాలా సంవత్సరాల తర్వాత

చాలా సంవత్సరాల తర్వాత

అంతేకాదు ఓ నోట్‌ని కూడా షేర్‌ చేసుకున్నారు చిరంజీవి. ఇందులో చిరంజీవి `చాలా సంవత్సరాల తర్వాత శబరిమల దర్శనం చేసుకోవడం జరిగింది. అయితే భక్తుల రద్దీ, అభిమానుల తాకిడి కారణంగా అందరినీ అసౌకర్యానికి గురి చేయకుండా డోలీలో వెళ్లవలిసి వచ్చింది. ఆ స్వామి పుణ్య దర్శనానికి భక్తుల కోసం తమ శ్రమ ధార పోస్తున్న ఆ శ్రమైక సోదరులకు నా హృదయాంజలి. ఈ ప్రయాణంలో ఫీనిక్స్ చుక్కపల్లి సురేష్‌, ఫీనిక్స్ గోపీల కుటుబాల తోడు మంచి అనుభూతినిచ్చింది` అని పేర్కొన్నారు.

కొత్త విడుదల తేదీ

కొత్త విడుదల తేదీ

సినిమాల విషయానికి వస్తే ఆయన హీరోగా నటించినా ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది రామ్ చరణ్ తేజ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కించారు. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా అనేక సార్లు వాయిదా పడింది. ఈ సినిమాను త్వరలో విడుదల చేస్తామని కొత్త విడుదల తేదీ కూడా ప్రకటించారు మరి చూడాలి ఈ సినిమా ఎప్పుడు విడుదల కాబోతోంది అనేది.

Recommended Video

Acharya Movie : Megastar Chiranjeevi Top 10 Highest Collected Movies | Tollywood | Filmibeat Telugu
మరో నాలుగు సినిమాలు

మరో నాలుగు సినిమాలు


ఈ సినిమా కాకుండా ఆయన మరో నాలుగు సినిమాలు లైన్ లో పెట్టారు. మోహన్ రాజ దర్శకత్వంలో లూసిఫర్ సినిమా రీమేక్. మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాలం రీమేక్ భోళా శంకర్, బాబీ దర్శకత్వంలో ఒక సినిమా అలాగే వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. గ్యాప్ లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X