దటీజ్ విక్రమ్.. అనారోగ్యాన్ని లెక్క చేయకుండా.. ఆ ఫంక్షన్‌‌కు హాజరవుతున్న చియాన్!

దక్షిణాది సూపర్ స్టార్ చియాన్ విక్రమ్ తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరడం అభిమానులను, సినీ వర్గాలను దిగ్బ్రాంతికి గురిచేసింది. తాను నటించిన పొన్నియన్ సెల్వన్ టీజర్ రిలీజ్‌కు ముందు విక్రమ్ చెన్నైలోని హాస్పిటల్‌లో చేరడంపై అనేక ఊహాగానాలు, రూమర్లు మీడియాలో వచ్చాయి. అయితే కుమారుడు ధ్రువ్.. తన తండ్రి ఛాతీలో నొప్పి కారణంగా హాస్పిటల్‌లో చేరానని క్లారిటీ ఇవ్వడంతో రూమర్లకు తెర దించారు. అయితే అనారోగ్యాన్ని లెక్క చేయకుండా విక్రమ్ ఓ ఫంక్షన్‌కు హాజరుకాబోతున్నారనే వార్త అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. ఆ వార్త వివరాల్లోకి వెళితే..

ఛాతీ నొప్పితో విక్రమ్

ఛాతీ నొప్పితో విక్రమ్

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన పొన్నియన్ సెల్వన్ టీజర్ రిలీజ్ వేడుకలో విక్రమ్ పాల్గొనాల్సింది. అయితే ఛాతీలో నొప్పి తీవ్రం కావడంతో ఆయనను చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించి ట్రీట్‌మెంట్ అందించారు. అయితే చియాన్ లేకపోవడం అభిమానులకు నిరాశను కలిగించింది. అయితే చియాన్‌ ఆరోగ్యమే ముఖ్యం అని ఫ్యాన్స్ ట్వీట్లు చేశారు.

నాన్న ఆరోగ్యం బాగానే ఉందని అంటూ

నాన్న ఆరోగ్యం బాగానే ఉందని అంటూ

అయితే విక్రమ్ ఆరోగ్య పరిస్థితిపై రూమర్లు ప్రచారంలోకి రావడంతో కుమారుడు ధ్రువ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. డియర్ ఫ్యాన్స్ నాన్న ఆరోగ్యం బాగానే ఉంది. స్వల్పంగా ఛాతీలో నొప్పి వచ్చింది. అయితే వెంటనే హాస్పిటల్‌కు పంపించి.. ట్రీట్‌మెంట్ అందించడంతో ఆయన ఆరోగ్యం ఉన్నారు. హార్ట్ ఎటాక్‌కు గురయ్యారనే వార్తల్లో నిజం లేదు. రూమర్లతో మా కుటుంబ చాలా బాధపడింది అని ధ్రువ్ పోస్టులో పేర్కొన్నారు.

జూలై 11వ తేదీన ఆడియో ఫంక్షన్

జూలై 11వ తేదీన ఆడియో ఫంక్షన్

అయితే అనారోగ్యం నుంచి కోలుకొన్న విక్రమ్ త్వరలోనే కోబ్రా టీజర్ రిలీజ్‌ ఫంక్షన్‌లో పాల్గొంటారని దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ట్వీట్ చేయడంతో చియాన్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం ఉరకలేసింది. జూలై 11వ తేదీన నిర్వహించే గ్రాండ్ మ్యూజిక్, టీజర్ రిలీజ్ ఫంక్షన్‌కు వస్తారని దర్శకుడు అజయ్ ధృవీకరించారు.

విక్రమ్ వస్తున్నాడు అంటూ అజయ్

విక్రమ్ వస్తున్నాడు అంటూ అజయ్

దర్శకుడు అజయ్ ట్వీట్ చేస్తూ.. కోబ్రా సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం జూలై 11వ తేదీన చెన్నైలోని ఫోనిక్స్ మార్కెట్ సిటీలో జరుగుతుంది. చియాన్ విక్రమ్ వస్తున్నారు. ఏఆర్ రెహ్మన్ మ్యూజిక్ లాంచ్ జరుగుతుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తున్నది.

విక్రమ్ సార్ విశ్రాంతి తీసుకోవాలి

విక్రమ్ సార్ విశ్రాంతి తీసుకోవాలి

అయితే దర్శకుడు అజయ్ చేసిన కోబ్రా ఆడియో లాంచ్ పోస్టుకు మిశ్రమ స్పందన లభిస్తున్నది. అయితే ఆరోగ్య పరిస్థితుల కారణంగా విక్రమ్ విశ్రాంతి తీసుకోవాలి. విక్రమ్ సార్ ఆడియో ఫంక్షన్‌కు రాకపోయినా ఫర్వాలేదు. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. మేము ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నాం అని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X