4 ఇడ్లీల కోసం పూలు అమ్మావా? ధనుష్‌ను ఏకిపారేస్తున్న నెటిజన్లు

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ఇడ్లీ కడై (తెలుగులో ఇడ్లీ కొట్టు). వండర్ బార్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అరుణ్ విజయ్, నిత్య మీనన్, శాలిని పాండే, సత్యరాజ్, ఆర్ పార్తీబన్, పీ సముద్రఖని, రాజ్ కిరణ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం, కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫి, ప్రసన్న జీకే ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. విజయదశమి కానుకగా ఈ సినిమా అక్టోబర్ 1వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది.

ఇడ్లీ కడై సినిమా ప్రమోషన్స్‌ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే చెన్నైలో ఇటీవల భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో ధనుష్ చేసిన హంగామా అందర్నీ ఆకట్టుకొన్నది. అయితే భావోద్వేగంతో ఆయన చేసిన ప్రసంగం అభిమానులను ఎమోషనల్‌గా మార్చితే.. కొందరు దానిని తప్పు పడుతున్నారు. తన ప్రసంగంలో ధనుష్ చెప్పిన మాటలను ట్రోల్ చేస్తున్నారు. ఇంతకు ధనుష్ చేసిన కామెంట్స్ ఏమిటంటే?

Dhanush trolled netizens

ఇడ్లీ కడై సినిమా ప్రమోషన్స్‌లో ధనుష్ మాట్లాడుతూ.. తన బాల్యంలోని కొన్ని విషయాలను గుర్తు చేసుకొని ప్రస్తావించారు. నాకు ఇడ్లీలు అంటే చాలా ఇష్టం. ప్రతీ రోజు ఇడ్లీ తినాలని ఉండేది. కానీ ఆ సమయంలో వాటిని కొనిచ్చే ఆర్థిక స్థోమత నా కుటుంబానికి లేకపోయింది. అందుకోసం ఉదయం 4 గంటలకు లేచి.. తన సోదరి, కజిన్‌తో కలిసి పక్కింట్లో నుంచి పూలు తీసుకొని.. వాటిని 2 రూపాయల చొప్పున అమ్మే వాళ్లం. అలా వచ్చిన డబ్బుతో 4, 5 ఇడ్లీలు తినేవాళ్లం అని ధనుష్ చెప్పారు.

అలా కష్టపడి సొంతంగా సంపాదించిన డబ్బుతో ఇడ్లీ తినడం వల్ల వచ్చిన సంతృప్తి ముందు ఏది కూడా తృప్తిని ఇవ్వదు. అదే సమయంలో రెస్టారెంట్‌కు వెళ్లి ఇడ్లీ తింటే అలాంటి సంతోషం నాకు కలిగేది కాదు అని ధనుష్ తన మనసులోని విషయాలను షేర్ చేసుకొన్నారు. అయితే తమిళంలో పెద్ద నిర్మాత కస్తూరి రాజా కొడుకైన ధనుష్ చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నిర్మాత కొడుకువైన నీకు పూలు అమ్మాల్సిన ఖర్మ పట్టిందా? ఇది ప్రమోషన్స్ కోసం చేసిన జిమ్మిక్కులా ఉందే అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు.

చిన్నతనంలో ధనుష్ డబ్లులు లేక పేదరికంతో బాధపడ్డరా? అయితే వాళ్ల నాన్న, దర్శకుడు, నిర్మాత కస్తూరి రాజా ఆయనకు డబ్బు ఇవ్వలేదా? నీవు 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మీ నాన్న 4, 5 సినిమాలకు డైరెక్షన్ చేశాడు? కానీ నువ్వేమో.. ఇడ్లీలు కొనలేని స్థితిలో ఉన్నావని చెబుతున్నావు. ఓ దర్శకుడి కొడుకైన ధనుష.. డబ్బులు లేవని చెప్పడం శుద్ద అబద్దం అని ఓ నెటిజన్ ట్విట్టర్‌లో కామెంట్ చేశాడు.

ఇడ్లీలు కొనడానికి డబ్బులు లేవు ధనుష్ చేసిన కామెంట్స్‌పై మరో నెటిజన్ స్పందిస్తూ.. నేను దిగువ మధ్య తరగతి కుటుంబంలో పెరిగాను. నేను 7 నుంచి 10వ తరగతి చదివే రోజుల్లో.. ఓ ప్లేట్ ఇడ్లీ తినడానికి ఎలాంటి కష్టాలు పడలేదు. కానీ ధనుష్ లాంటి వ్యక్తులు ఇడ్లీల కోసం పూలు అమ్మాడని చెబితే.. నమ్మడానికి అవకాశం లేకుండా పోయింది అని మరో నెటిజన్ అన్నాడు. ఇదంతా సినిమా ప్రమోషన్స్ కోసం అతిగా చెప్పడమే.. ధనుష్ గురించి తెలిసిన ఎవరైనా ఇలాంటి విషయాలు నమ్ముతారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

More from Filmibeat

Read more about: dhanush dasara Idli Kadai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X