Don't Miss!
- News
కోటంరెడ్డి కీలక నిర్ణయం - రిటర్న్ గిఫ్ట్..!!
- Finance
Infosys: ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ ఝలక్..! ఉద్యోగాల తొలగింపు.. ఆ టెక్నిక్ వాడుతూ..
- Travel
వైజాగ్ సమీపంలోని సందర్శనీయ పర్యాటక ప్రదేశాలు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Sports
INDvsAUS : స్పిన్నర్ల ఎంపికపై ఆసీస్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Chatrapathi Hindi Remake: మొదలైన బెల్లంకొండ రీమేక్.. దర్శకుడి కోసం క్లాప్ కొట్టిన రాజమౌళి
టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సినిమాల్లో ఛత్రపతి ఒకటి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా ప్రభాస్ రేంజ్ ను అమాంతంగా పెంచేసింది. ఇక 16 ఏళ్ళ అనంతరం మళ్ళీ ఆ సినిమాను గ్రాండ్ గా రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు. దర్శకుడు వివి.వినాయక్ నార్త్ జనాలకు నచ్చే విధంగా సరికొత్త మేకింగ్ తో ఆకట్టుకోవలని ఫిక్స్ అయ్యాడు.
ఇక ప్రభాస్ చేసిన ఛత్రపతి క్యారెక్టర్ కు బెల్లంకొండ శ్రీనివాస్ ఎంతవరకు న్యాయం చేస్తాడు అనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఈ హీరో డబ్బింగ్ సినిమాలు హిందీలో వందల మిలియన్ల వ్యూవ్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక అదే నమ్మకంతో పెన్ స్టూడియోస్ బెల్లంకొండతో ఛత్రపతి రీమేక్ ను బాలీవుడ్ లో నిర్మించేందుకు సిద్ధమయ్యారు.

ఇక నేడు హైదరాబాద్ లో సినిమా షూటింగ్ ను పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి పాల్గొని మొదటి క్లాప్ కొట్టారు. వివి.వినాయక్ కు రాజమౌళికి మంచి స్నేహితుడని అందరికి తెలిసిన విషయమే. అంతే కాకుండా చిత్ర యూనిట్ సబ్యులకు కూడా ప్రత్యేకంగా విషెస్ అందించారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన కథ విషయంలో మరోసారి రాజమౌళి, విజయేంద్రప్రసాద్ సహాయం కూడా తీసుకోనున్నారు. ఎలాగైనా సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని వినాయక్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. మరి ఆ యాక్షన్ సినిమాను ఏ స్థాయిలో తెరకెక్కిస్తారో చూడాలి.