twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా తండ్రిని కూడా తిడుతున్నారు.. చంపుతామని బెదిరిస్తున్నారు.. స్టార్ హీరో వివరణ

    |

    ఓ సినిమాలో అభ్యంతరకరమైన సీన్స్ ఉండటం, డైలాగ్స్, పాటలు ఒకరిని కించపరిచే విధంగా ఉన్నాయని ఆరోపించడం, కథ, కథనం తమకు సంబంధించి వాటిలా ఉందని ఇలా ఏదో రకంగా సినిమాపై సదరు ఫ్యాన్స్, వ్యక్తులు గాని అసహనం వ్యక్తం చేస్తుంటారు. ఇక అభిమానుల సంగతి సరేసరి. సినిమాపై, హీరోలపై, దర్శకులపై మాటల తూటాలు వదులుతూ రెచ్చిపోతోంటారు. సోషల్ మీడియాలో కామెంట్లతో నిద్రపట్టకుండా చేస్తారు. తాజాగా ఇలాంటి పరిస్థితే దుల్కర్ సల్మాన్‌కు ఎదురైంది. ఈ మేరకు దుల్కర్ ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ కూడా చేశాడు.

    వివాదాల్లో నిలుస్తున్న చిత్రం..

    వివాదాల్లో నిలుస్తున్న చిత్రం..

    దుల్కర్ సల్మాన్, కళ్యాణి ప్రియదర్శిని నటించిన వారానే అవశ్యముంద్ అనే మలయాళ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. మొన్నటికి మొన్న స్టార్ హీరో అయిన దుల్కర్..ఓ జర్నలిస్ట్‌కు బహిరంగంగా క్షమాపణ చెప్పవలసి వచ్చింది. ఈ ఘటనతో ఈ చిత్రం ఒక్కసారి వార్తల్లో నిలిచింది.

    అనుమతి లేకుండా ఫోటో..

    అనుమతి లేకుండా ఫోటో..

    సినిమాలో తన అనుమతి లేకుండా ఫోటో వాడారని సదరు జర్నలిస్ట్ చెప్పుకొచ్చింది. అది బాడీ షేమింగ్‌ను ప్రేరేపించేలా ఉందని, అనుమతి లేకుండా తన ఫోటోను ఎలా వాడుకుంటారని దుల్కర్‌ను ప్రశ్నించింది. దుల్కర్ ట్వీట్ చేస్తూ., క్షమించండి అది పొరపాటున తెలియకుండా జరిగిందని చెప్పుకొచ్చాడు.

    తమిళ ప్రజలను కించపరిచేవిధంగా..

    తమిళ ప్రజలకు కించపరిచే విధంగా ప్రభాకరన్ జోక్ అనే ఓ సన్నివేశం ఉందని, దానిపై తీవ్రంగా ధూషిస్తున్నారని తనకు తెలిసిందని దుల్కర్ పేర్కొన్నాడు. అయితే అది తమిళ ప్రజలకు కించపర్చడం కాదని, మలయాళ పాత చిత్రం పట్టణ ప్రవేశంలోని ఓ కామెడీ సీన్‌కు ప్రతీక అని, దానిపై ఎన్నో మీమ్స్ ఉంటాయని చెప్పుకొచ్చాడు.

    Recommended Video

    Kanulu Kanulanu Dochayante Movie Press Meet
     కుటుంబం మొత్తాన్ని ధూషిస్తున్నారు..

    కుటుంబం మొత్తాన్ని ధూషిస్తున్నారు..

    సరే ఏది ఏమైనా మీరు మమ్మల్ని (హీరో, దర్శకుడు) తిట్టడం ఓకే అని తెలిపాడు. కానీ తండ్రులను, సీనియర్ నటులను ధూషించడం తప్పని చెప్పుకొచ్చాడు. ఏదీ కూడా కావాలని చేయలేదు.. ఎవ్వరైనా హర్ట్ అయి ఉంటే క్షమించండని కోరాడు. ఇకపై ధూషించడం, చంపుతామని బెదిరించడం, బాధపెట్టేలా కామెంట్స్ చేయరని ఆశిస్తన్నానని తెలిపాడు.

    English summary
    Dulquer Salmaan Says Sorry To Tamilians For Varane avashyamund. He Says That To all those who were offended. I apologise. And I also apologise on behalf of #VaraneAvashyamund and
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X