Kantara Success Story: నిర్మాతకు కారు డ్రైవర్‌గా పనిచేశా.. నా లైఫ్ ఇలా మారుతుందనుకోలేదు.. రిషబ్ శెట్టి
పాన్ ఇండియా స్టార్ అండ్ స్టార్ డైరెక్టర్ రిషబ్ శెట్టి (Rishab Shetty) పేరు పాన్ ఇండియా వైడ్ గా మార్మోగిపోతోంది. కాంతార సినిమాతో ఎక్కడ లేని క్రేజ్ పొందారు. జాతీయస్థాయిలో ఊహించని స్థాయిలో గుర్తింపు వచ్చింది. చిన్న సినిమాగా విడుదలై బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకొని ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పుడు దీని ప్రీక్వెల్‌గా వచ్చిన 'కాంతార చాప్టర్ 1' (Kantara Chapter1) కూడా అదేస్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిషబ్ శెట్టి బ్యాక్ గ్రౌండ్ గురించి అంతా వెతుకుతున్నారు. ఆయన బ్యాక్ ఏంటీ ? అని నెట్టింట్లో తెగ సెర్చ్ చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ రిషబ్ శెట్టి కి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేదు. రిషబ్ కర్ణాటకలోని కెరాడి అనే మారుమూల గ్రామంలో ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించాడు. ఆయన తండ్రి జ్యోతిష్యుడు. అన్న, అక్క తర్వాత రిషబ్ పుట్టారు. ఇంట్లో పరిస్థితి వల్ల ఖర్చులకు కూడా తండ్రిని అడిగేవాడు కాదు రిషబ్. చదువుకునే సమయంలో తన ఖర్చు కోసం మినరల్ వాటర్, టీ పౌడర్, సోలార్ పవర్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ను అమ్మేవారు. ఇలా తన ఖర్చు తీర్చుకుంటూ కుటుంబానికి అండగా నిలిచే వారు. ఇక డిగ్రీ తర్వాత ఫిల్మ్ మేకింగ్ పై షార్ట్ టర్మ్ కోర్సు చేశాడు. చదువుకునే రోజుల్లో నుంచే సినిమాల్లోకి రావాలనే తపన ఉంది ఆయనకు.

ఎలాగైనా సినిమాల్లో నిలదొక్కుకోవాలని 2008లో రిషబ్ ముంబైకి వెళ్లి సినిమా ప్రయత్నాలను కొనసాగించేవారు. ఈ సమయంలో క్లాప్ బాయ్, స్పాట్ బాయ్, అసిస్టెంట్ డైరెక్టర్, తర్వాత నిర్మాత డ్రైవర్‌గా పని చేశాడు. ఆ సమయంలో రోడ్డు పక్కన వడపావ్ తో కడుపు నింపుకున్నా రోజులు ఎన్నో. ఇలా దాదాపు ఆరు సంవత్సరాల పాటు వివిధ విభాగాల్లో పనిచేసి డైరెక్టర్ గా బ్రేక్ అందుకున్నారు. అలా 2012లో తుగ్లక్ అనే సినిమాతో ఇండస్ట్రీకి నటుడు పరిచయమయ్యారు. ఆ తర్వాత 2016లో కిరిక్ పార్టీ సినిమాతో దర్శకుడిగా మారారు. అది యావరేజ్ టాక్ తెచ్చుకున్నా, అదే ఏడాది వచ్చిన కిరిక్ పార్టీ మాత్రం సంచలన విజయం సాధించింది. ఆ విజయంతో రిషబ్ పేరు పరిశ్రమంతటా మార్మోగిపోయింది. ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు.
రిషబ్ శెట్టి కెరీర్‌లో గేమ్‌చేంజర్‌గా నిలిచింది 2022లో వచ్చిన కాంతార. తక్కువ బడ్జెట్‌లో నిర్మించిన ఈ సినిమాను హోంబలే సంస్థ రిలీజ్ చేయగా, చిన్న సినిమాగా మొదలైన ఈ పాన్ ఇండియా మూవీ సంచలనం సృష్టించింది. సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసి పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రిషబ్ నటన, దర్శకత్వం, కథనం అన్నీ కలిపి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాయి. ఇలా 2023లో ఈ సినిమాకి గాను నేషనల్ బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్నారు.
ఆ సినిమాతో రిషబ్ శెట్టి ఒకేసారి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని రెమ్యునరేషన్‌లోనూ భారీ పెరుగుదల వచ్చింది. కాంతార కోసం ఆయన తీసుకున్న పారితోషికం రూ.4 కోట్లు కాగా, ఇప్పుడు వస్తున్న కాంతార చాప్టర్ 1 కోసం రూ.100 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు ఆఫీస్ బాయ్, నిర్మాత డ్రైవర్‌గా పనిచేసిన రిషబ్ నేడు పాన్ ఇండియా స్టార్‌గా మారడం ఎంతో మందికి స్పూర్తిదాయకం. ఆయన ప్రయాణం కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, సినీ రంగంలో ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికీ ఒక ప్రేరణ.


Click it and Unblock the Notifications











