మొత్తానికి గోపిచంద్ సినిమాతోనే టెస్ట్ చేస్తున్నారు.. సెకండ్ వేవ్ తరువాత వస్తున్న మొదటి సినిమా!
సినిమా ఇండస్ట్రీలో కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు మళ్ళీ థియేట్రికల్ బిజీనెస్ బాగా తగ్గిపోయింది. ఈ ఏడాది మొదట్లో కొన్ని సినిమాలు మంచి బూస్ట్ ఇవ్వగా అదే తరహలో కంటిన్యూ అవుతుందని చాలామంది నిర్మాతలు ఆశపడ్డారు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ ఎత్తేసినప్పటికి ఇంకా థియేటర్స్ ఓపెన్ కాలేదు.
ఏ సినిమా ముందు రిలీజ్ అవుతుందో అని జనాల్లో ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. గత ఏడాది అయితే ధైర్యం చేసి సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను వదిలారు. కానీ ఈసారి ఎవరు అంతగా ధైర్యం చేయడం లేదు. కొందరైతే డైరెక్ట్ గా ఓటీటీలోకి వెళ్ళడానికి కూడా సిద్ధమయ్యారు. ఇక ఫైనల్ గా మొదట గోపిచంద్ సినిమానే రానుంది. ఆగస్ట్ లోనే థియేటర్స్ ను ఓపెన్ చేయాలని భావిస్తున్నారు. అదికూడా పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే.

ఇక ఆగిపోయిందని అనుకున్న ఆరడగుల బుల్లెట్ సినిమాను మళ్ళీ కొత్తగా ఎడిట్ చేసి విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. బి.గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్ నయనతార జంటగా నటించినా ఆ సినిమా 9ఏళ్ల క్రితమే విడుదల కావాల్సింది. కానీ పలు ఆర్థిక కారణాల వలన రెండు సార్లు వాయిదా పడింది. ఇక ఫైనల్ గా ఇటీవల అన్ని కష్టాలను దాటిన నిర్మాత తాండ్ర రమేష్ ఆగస్ట్ లోనే విడుదల చేయబోతున్నట్లు చెప్పారు. మరి ఆ సినిమా జనాలను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











